క్రికెటర్ మహమ్మద్ షమీ అరెస్ట్ పై సుప్రీం కోర్ట్ కీలక ఆదేశాలు.. !

-

గత కొన్ని సంవత్సరాలుగా క్రికెటర్ మహమ్మద్ శమికి మరియు అతని భార్య హసీనా జహాన్ కు మధ్యన విభేదాలు ఉన్న సంగతి తెలిసిందే. పైగా ఈమె భర్తపై గృహహింస కేసును కూడా నమోదు చేసింది. అప్పటి నుండి ఈ కేసు కోర్ట్ ల చుట్టూ తిరుగుతూనే ఉంది. కాగా ఒకానొక దశలో మహమ్మద్ షమీ చేసింది తప్పు అని నిర్దారించిన కోర్ట్ ఆయనను అరెస్ట్ చేయాలని పోలీస్ శాఖను ఆదేశించింది. ఆ తర్వాత మహమ్మద్ షమీ తరపున లాయర్ సుప్రీం కోర్టును సంప్రదించి అరెస్ట్ పై స్టే విధించాలని పిటిషన్ వేయడంతో తాత్కాలికంగా మహమ్మద్ షమీ అరెస్ట్ తప్పింది. కానీ షమీ భార్య అంతటితో శాంతించక సుప్రీం లో ఈ అరెస్ట్ పై ఉన్న స్టే ను ఎత్తివేయాలని మరో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ పై విచారణ చేసిన సిజెఐ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మసనం వెస్ట్ బెంగాల్ సెషన్స్ కోర్ట్ కు కీలకమైన ఆదేశాలను ఇచ్చింది.

ఎటువంటి పరిస్థితుల్లోనూ ఈ కేసును మీరు ఒక నెల రోజుల లోపల పరిష్కరించాలని రిపోర్ట్ లో పేర్కొంది. అది కూడా కుదరని పక్షములో స్టే ఆర్డర్ లో మార్పులు చేయాలని చెప్పింది.

Read more RELATED
Recommended to you

Latest news