మాజీ మంత్రి నారాయణ కు బెయిల్ పొడగిస్తూ ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు. బెయిల్ ను మరో ఆరు వారాలకు పొడిగించింది. పదవ తరగతి పరీక్ష పత్రాల లీక్ కేసులో మాజీ మంత్రి నారాయణ విచారణ ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ కేసులో తదుపరి విచారణ ఈనెల 27 కి వాయిదా వేసింది.
పదవ తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో నారాయణ విద్యాసంస్థల వ్యవస్థాపకుడు, మాజీ మంత్రి నారాయణను హైదరాబాద్ లో ఏపీ పోలీసులు గతంలో అరెస్టు చేశారు. హైదరాబాద్ నుంచి చిత్తూరుకు తరలించారు. ఏప్రిల్ 27 న చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలం నీళ్ళపల్లి లో జడ్పీ ఉన్నత పాఠశాల నుంచి పదవ తరగతి తెలుగు ప్రశ్న పత్రం వాట్సాప్ ద్వారా బయటకు వచ్చిన కేసులో నారాయణ పాత్ర ఉన్నట్టు తేలడంతో ఆయనని అరెస్ట్ చేసారు.