ఎవ్వరూ ఊహించని విధంగా ఎన్నో నాటకీయ పరిణామాల నేపథ్యంలో నిన్న పాకిస్తాన్ మాజీ క్రికెటర్ మరియు అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అరెస్ట్ చేసిన అనంతరం ఈ రోజు ఇస్లామాబాద్ లోని న్యూ పోలీస్ గెస్ట్ హౌస్ లో ప్రవేశ పెట్టనున్నారు. అయితే ప్రస్తుతం పాకిస్తాన్ మీడియా తెలుపుతున్న సమాచారం ప్రకారం విచారణ తర్వాత నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో ఇమ్రాన్ ఖాన్ ను కనీసం నాలుగు రోజులు అయినా కస్టడీలో ఉంచేలాగా ఉన్నారట. ఇక ఒక మాజీ అధ్యక్షుడుగా ఉన్న ఇమ్రాన్ ఖాన్ ను అరెస్ట్ చేయడంతో ప్రజల్లో తిరుగుబాటు వచ్చింది.
ఒక అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తికి అభిమానులు ఏ స్థాయిలో ఉంటారో ? వ్యతిరేకులు కూడా అదే స్థాయిలో ఉండడం చాలా సహజం. ప్రస్తుతం ఈయన అరెస్ట్ ను వ్యతిరేకిస్తూ క్వెట్టా , కరాచీ , పెషావర్, రావల్పిండి, లాహోర్ నగరాలలోని అల్లర్లు ఎక్కువవడంతో పరిస్థితి చేయిదాటి పోయింది.