తలసానితో తిప్పలు..డ్యామేజ్ పెంచుతున్నారు.!

-

నేటి రాజకీయాల్లో నిర్మాణాత్మకమైన విమర్శలు చేసుకోవడం కంటే బూతులు తిట్టుకోవడమే ఎక్కువ ఉన్న విషయం తెలిసిందే. నేతలు తిట్టుకుంటేనే రాజకీయం అన్నట్లు ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో అదే పరిస్తితి ఉంది. తమ అధిష్టానాల వద్ద మార్కులు కొట్టేయడానికి నేతలు..ప్రత్యర్ధుల్ని తిడుతున్నారని తెలుస్తోంది. అలా తాజాగా తెలంగాణ రాజకీయాల్లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్..సడన్ గా హాట్ టాపిక్ అయ్యారు..ఆయన అనూహ్యంగా రేవంత్ రెడ్డిని గొంతు పిసికితే పోతావు నా కొడకా అంటూ తిట్టిన తిట్లు సంచలనం రేపుతున్నాయి.

తాజాగా తెలంగాణకు ప్రియాంక గాంధీ వచ్చిన విషయం తెలిసిందే. నిరుద్యోగ యువతపై వరాల జల్లు కురిపించారు. ఇక ఆ సభలో టి‌పి‌సి‌సి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి..కే‌సి‌ఆర్ ప్రభుత్వం టార్గెట్ గా విమర్శలు చేశారు. ఈ క్రమంలో రేవంత్ విమర్శలకు కౌంటర్ ఇచ్చే ప్రయత్నంలో తలసాని నోరు జారారు. ఆ పొట్టోడు యూత్ డిక్లరేషన్ గురించి మాట్లాడుతాడని, , వాడి నోటికి అడ్డూ అదుపూ లేదని, ఎమ్మెల్యే, మంత్రి అన్నది కూడా లేదని, వాడు అందరి గురించి వాడు వీడు అని మాట్లాడతాడని, ఇంత లేడు.. వాడి పర్సనాలిటీ ఎంత.. వాడు ఎంత? పిసికితే ప్రాణం పోతుంది నా కొడుక్కు .. అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇక తెలంగాణలో సీఎం కేసీఆర్ యాదాద్రి ఆలయాన్ని అద్భుతంగా నిర్మించారని, మరి బీజేపీ నా కొడుకులు ఎక్కడైనా గుడి కట్టారని ఫైర్ అయ్యారు.  కులమతాల మధ్య చిచ్చు పెట్టటం తప్ప బీజేపీ మరేమీ చెయ్యదని మండిపడ్డారు.

ఇలా తలసాని సడన్ గా ప్రత్యర్ధులని తిట్టారు. అయితే రాజకీయంగా తలసానిపై వ్యతిరేకత ఉంది..సొంత పార్టీలో పెత్తనం చేస్తున్నారని..గ్రేటర్ హైదరాబాద్ నేతలు అసంతృప్తిగా ఉన్నారు. ఆయనపై తిరుగుబాటు ఎగరవేస్తున్నారు. బి‌ఆర్‌ఎస్ అధిష్టానం కూడా తలసానిపై నెగిటివ్ గా ఉంది. ఈ క్రమంలో హైలైట్ అవ్వాలని తలసాని..ఇలా ప్రత్యర్ధులని టార్గెట్ చేశారని విమర్శలు వస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news