ఊరందరికీ కరోనా పాజిటివ్.. కానీ ఒక్కరికి తప్పా..?

-

భారత్ లో కరోనా వైరస్ ఏ రేంజ్ లో విజృంభిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కొన్ని కొన్ని రాష్ట్రాలలో అయితే ప్రజలు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ శర వేగంగా వ్యాప్తి చెందుతూ ప్రజలందరినీ బెంబేలెత్తిస్తోంది. ఇక్కడ మరింత దారుణంగా వ్యాపించింది కరోనా వైరస్. ఏకంగా ఒక ఊరు పైన పంజా విసిరింది. ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా కరోనా పాజిటివ్ అని వచ్చింది. కానీ ఒక్క వ్యక్తికి మాత్రం నెగిటివ్ అని రావడంతో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిపోయింది. హిమాచల్ ప్రదేశ్ లో జరిగింది ఈ ఈ ఆసక్తికర ఘటన.

తొరాంగ్ గ్రామంలో ఊర్లో అందరికీ కరోనా నిర్ధారిత పరీక్షలు చేయగా పాజిటివ్ అని వచ్చింది కానీ ఒకే ఒక్క వ్యక్తికి నెగిటివ్ అని వచ్చింది. ఆ గ్రామంలో దార్మిక కార్యక్రమం జరుగగా ఊరి ప్రజలందరూ ఎలాంటి కరోనా జాగ్రత్తలు పాటించకుండా ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే ఇటీవల ఊర్లో ఉన్న వారందరూ కరోనా పరీక్షలు చేయించుకున్నారు.. కాగా భూషణ్ ఠాగూర్ అనే వ్యక్తి మినహా మిగతా అందరికీ కూడా పాజిటివ్ అని తేలింది. కాగా ఊర్లో ఉన్న వాళ్ళు ఇతర గ్రామాలకు వెళ్లగా 45 మంది పరీక్షలు చేయించుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news