టాలీవుడ్‌లో వున్న స్టార్ హీరోయిన్ లలో రష్మిక మందన్నకున్న క్రేజ్ తెలిసిందే. తొలి చిత్రం `కిరిక్ పార్టీ`తో కన్నడలో తొలి విజయాన్ని దక్కించుకుంది. దీంతో తెలుగు ఫిల్మ్ మేకర్స్‌ని ఆకట్టుకున్నరష్మిక `ఛలో` మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. తొలి మూవీతో టాలెంటెడ్ ఆర్టిస్ట్‌గా పేరు తెచ్చుకుంది. ఆ తరువాత తెలుగులో నటించిన గీత గోవిందం, భీష్మ, సరిలేరు నీకెవ్వరు వంటి చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్‌లుగా నిలిచాయి.
ఈ ఏడాది మహేష్‌తో కలిసి నటించిన `సరిలేరు నీకెవ్వరు` బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలవడంతో టాప్ మీరోయిన్ ల జాబితాలో చేరింది. రష్మిక నటించింది కేవలం రెండు భాషల్లోనే. అంటి ఆమెకు గూగుల్ సర్‌ప్రైజ్ షాకిచ్చింది. గూగుల్ సెర్చ్ లో రష్మికని నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియాగా చూపించడం విస్మయాన్ని కలిగిస్తోంది.
దిశా పటాని, మనుషీ చిల్లర్, ప్రియ ప్రకాష్ వాయిర్‌లకు మాత్రమే దక్కిన ఈ గౌరవం రష్మికకు దక్కడం విశేషంగా చెబుతున్నారు. రష్మిక తెలుగు, కన్నడ చిత్రాలకు పరిమితమైనా ఆమె నటించిన ఛలో, గీత గోవిందం, భీష్మ, సరిలేరు నీకెవ్వరు చిత్రాలు హిందీలో డబ్ అయ్యాయి. ఈ సినిమాలతో రష్మిక జాతీయ స్థాయిలో పాపులారిటీని సొంతం చేసుకుంది. అంతే కాకుండా రష్మిక వాడే డ్రెస్ కోడ్.. కాస్ట్యూమ్స్ కూడా నచ్చడంతో రష్మిక నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియా గూగుల్ గుర్తించినట్టు చెబుతున్నారు. రష్మిక ప్రస్తుతం బన్నీ హీరోగా నటిస్తున్న `పుష్ప` చిత్రంలో నటిస్తోంది.