అజినోమోటోతో సైడ్ ఎఫెక్ట్స్ తప్పవట..ఈ సమస్యలు రావటం పక్కా..!

-

జంక్ ఫుడ్స్ అంటే..ఈరోజుల్లో ఇష్టపడని వాళ్లు అంటూ ఉండరేమో కదా..ఫైవ్ స్టార్ హోటళ్ల నుంటి తోపుడుబళ్ల వరకూ చైనీస్ ఫుడ్ తింటూ ఎంతో మంది ఎంజాయి చేస్తున్నారు. బిర్యానీల్లో, పులావుల్లో..కొన్ని చైనీన్ వంటకాల్లో అజినోమోటో( Monosodium) కచ్చితంగా వాడుతుంటారు. ఇది వంటకు రుచిని ఇస్తుందనే అందరూ వాడుతుంటారు..కానీ దీనివల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయంటున్నారు ఆరోగ్య నిపుణులు.
అజినోమోటో ఒక రకమైన రసాయనం. అజినోమోటోను మోనోసోడియం గ్లుమేట్ అని కూడా పిలుస్తారు. అజినోమోటో తెల్లటి క్రిస్టల్ పౌడర్ లాంటిది. చక్కెర-ఉప్పుతో సమానంగా ఉంటుంది. శరీరంలో అజినోమోటో ఎక్కువైతే అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. అజినోమోటోను చైనీస్ వంటకాలు, సూప్‌లు, సలాడ్‌లలో ఉపయోగిస్తారు. అజినోమోటో తినడం వల్ల అవయవాలు తిమ్మిరి, వాంతులు, చెమటలు, శరీర నొప్పులు, బలహీనత వంటి సమస్యలు వస్తాయట.
చైనీస్ ఆహారంలో కనిపించే అజినోమోటో నాడీ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. ఇది నరాలను దెబ్బతీస్తుంది. మెదడు దెబ్బతినే ప్రమాదాన్ని పెంచుతుందట. ఇందులో ఉండే గ్లుటామిక్ యాసిడ్ మెదడులోని న్యూరోట్రాన్స్‌మిటర్‌లా పనిచేస్తుంది. శరీరంలో అధిక స్థాయిలో ఇది మెదడును దెబ్బతీస్తుంది..
 జంక్ ఫుడ్ మనల్ని ఊబకాయం చేస్తుంది. బరువు పెరగడం వల్ల శరీరంలో అనేక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. కొంతమంది చౌమీన్, మోమోస్ తినడం అలవాటు చేసుకుంటారు. దీనికి కారణం చైనీస్ ఫుడ్‌లో ఉండే అజినోమోటో. అజినోమోటో ఆకలిని పెంచేలా చేస్తుంది.
గర్భిణీ స్త్రీలు చైనీస్ ఫుడ్ తినకూడదని సలహా ఇస్తారు. ఎందుకంటే.. ప్రధాన కారణం అజినోమోటో. ఇందులో సోడియం కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, అయితే గర్భధారణ సమయంలో సోడియం తీసుకోవడం చాలా తగ్గించాలి. అతిగా తినడం వల్ల కడుపు ఉబ్బరం అవుతుంది. ఇది పిల్లల హార్ట్ పై కూడా ప్రభావం చూపుతుంది.
అజినోమోటో అధిక రక్తపోటుకు కారణమవుతుంది. మీరు ఇప్పటికే బీపీ పేషెంట్ అయితే అజినోమోటో యాడ్ చేసిన వాటిని అసలు తినకూడదు. ఇది రక్తపోటు సమస్యను మరింత తీవ్రతరం చేస్తుంది.
నిద్రలేమి, మైగ్రేన్ సమస్యలు ఉంటే..అందుకు ప్రధాన కారణం అజినోమోటో కావచ్చు. ఈ ఆహారం తినడం వల్ల నిద్ర పట్టదు ,మెదడు ఉత్తేజితమవుతుంది. దీన్ని ఎక్కువగా తినడం వల్ల తలనొప్పి కూడా వస్తుంది. అజినోమోటో ఉన్న ఆహారాన్ని తినడం వల్ల రోజంతా అలసిపోయినట్లు అనిపిస్తుంది.
చూడ్డానికి పంచాదరపలుకుల్లా ఉండే అజినోమోటో ఆరోగ్యాన్ని ఇన్ని విధాలుగా పాడుచేస్తుందట..వాడేవాళ్లు కాస్త జాగ్రత్తపడాల్సిందే..!
-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news