Exciting toy train rides: కొండల మీదుగా ప్రయాణం.. వావ్ అనాల్సిందే..!

-

సాధారణంగా చేసే ప్రయాణాలు కంటే ఇలా టాయ్ ట్రైన్స్ లో ప్రయాణాలు చేయడం చాలా బాగుంటుంది. టాయ్ ట్రైన్స్ లో ఈ విధంగా ప్రయాణం చేస్తే ఎంతో సరదాగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి వెళ్ళినా… స్నేహితులతో వెళ్ళినా మంచిగా ఎంజాయ్ చెయ్యచ్చు. అయితే భారత దేశంలో ఉండే ఈ టాయ్ ట్రైన్స్ ని అస్సలు మిస్ అవ్వద్దు. మరి వాటి కోసం మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Exciting toy train ride

టాయ్ ట్రైన్ డార్జిలింగ్:

ఇది నిజంగా ఎంతో ఫన్ గా ఉంటుంది. ఇది జల్పైగురి నుండి డార్జిలింగ్ కి కనెక్ట్ అయి ఉంటుంది. రంగ్తోంగ, గుమ్, కార్సియోంగ్ మీద ఇది కవర్ అయ్యే వెళుతుంది. కనుక అసలు ఈ అవకాశం వస్తే మిస్ అవ్వద్దు.

నీలగిరి మౌంటెన్ రైల్వే తమిళనాడు:

ఇది కూడా చాలా బాగుంటుంది. పైగా ఎంతో ముచ్చటగా ఉంటుంది. ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఈ ప్రయాణం ఉంటుంది. మెట్టుపాలయం నుండి ఊటీ కి ఈ రైలు వెళ్తుంది. ఆకుపచ్చ రంగు చెట్ల నడుమ ఈ ప్రయాణం చేస్తూ ఉంటే ఆ భావాన్ని వివరించలేము. అంత మధురంగా ఉంటుంది.

కల్కా షిమ్లా రైల్వే హిమాచల్:

ఇది కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. కల్కా నుండి షిమ్లాకి రైలు వెళ్తుంది. చల్లగా స్నో మధ్యలో ఈ ప్రయాణం బాగుంటుంది.

కంగ్రా వ్యాలీ రైల్వే హిమాచల్:

ఈ జర్నీ కూడా చాలా అద్భుతంగా సాగుతుంది. అందమైన ఆలయాలు, టీ మరియు పైన్ చెట్లు ఇలా ప్రతిదీ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ అవకాశం వస్తే కూడా అస్సలు మిస్ అవ్వద్దు.

మాథెరాన్ హిల్ రైల్వే మహారాష్ట్ర:

చలికాలంలో వెళితే ఎంతో అద్భుతంగా ఉంటుంది. దారిలో వాటర్ ఫాల్స్ చెట్లు ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. కాబట్టి ఇక్కడికి కూడా వీలైతే ఒక ట్రిప్ వేసేయండి.

Read more RELATED
Recommended to you

Latest news