కాంగ్రెస్ 72 సీట్లు గెలబోతోంది.. అధికారంలోకి రావడం ఖాయం : రేవంత్

-

టీపీసీసీ రేవంత్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు కాంగ్రెస్ పార్టీకి చాలా అనుకూలంగా ఉన్నాయని.. నాకు ఉన్న రాజకీయ అవగాహన ప్రకారం కాంగ్రెస్ కచ్చితంగా 72 సీట్లు గెలుస్తుందని పేర్కొన్నారు…ఈసారి కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం.. ఎవరు ఆపలేరన్నారు. అందుకే మనం ఆగస్టు 9 క్విట్ ఇండియా దినం నుంచి తెలంగాణ విలీన దినం సెప్టెంబర్ 17 వరకు 40 రోజుల పాటు ఈ ఆత్మగౌరవ దండోరా కార్యక్రమం చేపట్టాలని వెల్లడించారు.

డీసీసీ లు ఈ విషయంలో చాలా సీరియస్ గా పని చేయాలని.. ఈ విషయంలో సామాజిక కోణం ఉందన్నారు. నియోజక వర్గాల వారీగా నివేదికలు తయారు చేయాలని.. బాగా పనిచేసిన వారిని పార్టీ గుర్తిస్తుందని తెలిపారు. 119 నియోజక వర్గాలకు ఇంచార్జి కు ఎలా పని చేశారో వారి… పనితీరుకు ఇదో కొలబద్దన్నారు. క్షేత్ర స్థాయిలో పని చేసిన వారి పనితీరు తోనే పార్టీ బాగు పడుతుందని.. 17 పార్లమెంట్ లో ప్రత్యేక నివేదికలు తయారు చేస్తామని వివరించారు.

ఏ స్థాయిలో పనిచేస్తున్న నాయకులు అయినా నియోజక వర్గంలో వారి పనితీరు పైన నివేదిక ఇవ్వాలని… మండలాల అధ్యక్షుల పనితీరు బాగుండాలి… వారు గట్టిగా పనిచేస్తే నియోజకవర్గంలో గెలవడం సులువని పేర్కొన్నారు. మండల అధ్యక్షలు మండల అధికారుల నుంచి పని చేయించగలగాలని.. పార్టీ నిర్మాణం, ప్రజా సమస్యలపై పోరాటం విషయంలో నాయకులు చురుగ్గా ఉండాలన్నారు. నియోజక వర్గంలో ఉన్న నాయకలుకు సమన్వయ కర్తలు ఖచ్చితంగా సమాచారం ఇవ్వాలని.. రాష్ట్రంలో కార్యకర్తలు గట్టిగా పని చేస్తున్నారు… నాయకులు కూడా గట్టిగా కొట్లాడాలని పిలుపు ఇచ్చారు రేవంత్.

 

 

Read more RELATED
Recommended to you

Latest news