కరోనా వైరస్: ఊపిరితిత్తుల ఆరోగ్యానికి వ్యాయామాలు…!

-

కరోనా వైరస్ కారణంగా చాలా మంది శ్వాస సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. దీంతో ఆసుపత్రిలో క్యూలు కట్టవలసి వస్తోంది. చాలా మందిలో కరోనా కారణంగా ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతున్నాయి.

హెల్త్ మరియు మెడికల్ ఎక్స్పోర్ట్స్ ఇటువంటి సమయంలో ఈ వ్యాయామాలు చేయడం మంచిది అని చెబుతున్నారు. 60 నుంచి 65 శాతం పేషెంట్స్ శ్వాస సంబంధిత సమస్యలతో సతమతమవుతున్నారు. కరోనా వచ్చిన రెండు నుంచి మూడు రోజులకి ఆక్సిజన్ లెవెల్స్ 80 కంటే తక్కువ ఉంటోంది. ఈ రోజు ఇటువంటి బాధలు కి చెక్ పెట్టడానికి కొన్ని పద్దతులు మీకోసం.

భస్త్రిక ప్రాణాయామ:

దీనిని మూడు రకాలుగా చెయ్యచ్చు. మొదట 5 సెకన్ల పాటు శ్వాస వదలడం రెండవ ప్రాసెస్ లో రెండున్నర సెకన్ల పాటు శ్వాస తీసుకోవడం.. ఆ తర్వాత రెండున్నర సెకండ్లు బయటికి వదలడం మూడవది వేగంగా శ్వాస తీసుకోవడం మరియు వేగంగా శ్వాసని వదిలేయడం. ఇలా ఐదు నిమిషాల పాటు చేయాలి.

అనులోమ్ విలోమ:

దీని కోసం కూర్చుని కళ్లు మూసుకోవాలి. స్ట్రెయిట్ గా కూర్చుని చేతులు రెండూ కూడా ధ్యానం పోస్ లో ఉంచాలి. ముక్కు ఎడమవైపు కుడి చేతి చిటికెన వేలు పెట్టి ముక్కు కుడి వైపు ఎడమ బొటన వేలు పెట్టి శ్వాస తీసుకుంటూ ఉండాలి.

భ్రమరీ ప్రాణాయామ:

సుఖాసనం లేదా పద్మాసనం వేసి శ్వాస తీసుకుంటూ ఉండాలి. కళ్ళు మూసి చేతుల్ని కళ్ళకి అడ్డు పెట్టుకోవాలి. చెవులు కూడా చేతులతో మూసేయాలి. 3 నుంచి 21 సార్లు ఈ ప్రణయమా చేయాలి.

కపాలి బాత:

కూర్చుని కళ్ళు ముయ్యాలి. ఇప్పుడు రెండు నోస్ట్రల్స్ నుండి శ్వాస లోపలికి తీసుకోవాలి ఆ తర్వాత శ్వాసని వదిలేయాలి అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవలసిన విషయం ఏమిటంటే శ్వాస గట్టిగా తీసుకుని నెమ్మదిగా వదిలేయాలి. ఇలా 20 సార్లు చేయాలి.

ఉజ్జయీ ప్రాణాయామ:

దీనికోసం శ్వాస గట్టిగా తీసుకుని ఎంత సేపు తీసుకోవాలంటే అంత సేపు తీసుకోవాలి ఆ తర్వాత కుడి నాస్త్రాల్ మూసేసి ఎడమ నోస్ట్రల్ నుంచి మాత్రమే తీసుకోవాలి.

నాడి శుద్ధి ప్రాణాయామం:

ఇది కూడా అనులోమ్ విలోమలాగే. కానీ మీరు ఇక్కడ కొద్దిసేపు శ్వాసని బిగపెట్టి ఉంచాలి ఇలా చేయడం వల్ల లోపలికి ఎక్కువ ఆక్సిజన్ వెళుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news