హనుమంతుడు గా ఈ ఇద్దరిలో ఒక హీరో అయితే.. బాక్స్ ఆఫీస్ బద్దలవుతుంది..!

-

తేజ సజ్జ హీరోగా వచ్చిన హనుమాన్ సినిమా పెద్ద హిట్ అయింది సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమా భారీ గా రాబట్టింది. ప్రశాంత్ వర్మ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు ఈ సినిమాకి సీక్వెల్ ఉంటుందని హనుమన్ సినిమా ఎండింగ్ లో జై హనుమాన్ సినిమాని అనౌన్స్ చేశారు. రాముడి ప్రాణ ప్రతిష్ట రోజున జై హనుమాన్ ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ ని కూడా స్టార్ట్ చేసేసారు. మీ అందరి ప్రేమాభిమానాల తో జై హనుమాన్ మొదలు పెడుతున్నాను అని ప్రశాంత్ వర్మ అన్నారు.

2025 సంక్రాంతికి జై హనుమాన్ సినిమా వస్తుందని ప్రశాంత్ వర్మ చెప్పారు హనుమాన్ సినిమా లో హనుమంతుడు పాత్ర గురించి చెప్పలేదు కనీసం ముఖాన్ని కూడా చూపించలేదు. ఎక్కువ మంది అభిమానులు హనుమాన్ గా రాంచరణ్ ఎన్టీఆర్ లలో ఒకరు నటిస్తే బాగుంటుందని అనుకుంటున్నారు రామ్ చరణ్ కి దైవభక్తి ఎక్కువే అలానే ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ సినిమా తర్వాత హనుమాన్ మాల వేసుకున్నారు ప్రేక్షకులు కోరుకున్నట్లు జరుగుతుందా లేదా అనేది చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news