గులాబీ బాస్ కి చిక్కులు.. కేసీఆర్ పై కేసు తప్పదా..?

-

మాజీ సీఎం కేసీఆర్ కి చిక్కులు తప్పవా..? కేసీఆర్ కి ఉచ్చు బిగిసుకుంటుందా? మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కూలిపోయిన ఘటన లో విజిలెన్స్ నివేదిక తో గులాబీ బాస్ కి సమస్యలు తప్పవా అని అంతా మాట్లాడుకుంటున్నారు. రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఇది హాట్ టాపిక్ అయిపోయింది. మేడిగడ్డ ఘటన మీద రేవంత్ రెడ్డి సర్కార్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విచారణకి ఆదేశంగా విజిలెన్స్ అధికారులు దర్యాప్తు లో సంచలన విషయాలను గుర్తించారు త్వరలోనే విజిలెన్స్ తన నివేదిక అనే ప్రభుత్వానికి అందిస్తుందని ఈ నివేదిక ఆధారంగా ప్రభుత్వం ఎఫ్ఐఆర్ నమోదు చేసే అవకాశాలు ఉన్నాయని జోరుగా చర్చ జరుగుతోంది.

కాలేశ్వరం ప్రాజెక్ట్ తన మానస పుత్రిక అని చెప్పుకున్న కేసీఆర్ విషయం లో ప్రభుత్వం ఏ విధంగా రియాక్ట్ అవుతుందనేది చూడాలి. మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలో భారీ స్కాం జరిగినట్లు తేల్చారని దాదాపు 3200 కోట్ల ప్రజాధనం నిర్మాణం పేరు తో వృధా చేస్తారని ఈ నిర్మాణానికి సంబంధించిన వాళ్ళు దోషులేనని గుర్తించినట్లు తెలుస్తోంది

Read more RELATED
Recommended to you

Latest news