డిగ్రీలో ప్రవేశాలకు దోస్త్ కౌన్సెలింగ్ గడువు పొడిగింపు

-

డిగ్రీలో ప్రవేశాలకు సంబంధించిన దోస్త్ కౌన్సెలింగ్ గడువును పొడిగించారు. దోస్త్ ఫస్ట్ ఫేజ్‌లో సీట్లు పొందిన వారు సెల్ఫ్ రిపోర్టింగ్‌కు గడువు పెంచారు.రెండో విడత రిజిస్ట్రేషన్, వెబ్ ఆప్షన్ల నమోదుకు కూడా గడువు పొడిగించారు. తొలి విడత సెల్ఫ్ రిపోర్టింగ్ గడువును జూన్ 12 నుంచి 15వ తేదీ వరకు, రెండో విడత రిజిస్ట్రేషన్ గడువును జూన్ 13 నుంచి 15వ తేదీ వరకు పొడిగించారు. దోస్త్ ఫేజ్-2 వెబ్ ఆప్షన్ల నమోదు గడువు జూన్ 14 నుంచి 15కు పెంచారు.

దోస్త్‌ ద్వారా ప్రవేశాలు కల్పించే ఉస్మానియా, కాకతీయ,మహాత్మాగాంధీ, తెలంగాణ, శాతవాహన,పాలమూరు యూనివర్సిటీల పరిధిలో మొత్తం 1066 డిగ్రీ కాలేజీలుండగా, వాటిలో 136 ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు, నాన్‌ దోస్త్‌ కాలేజీలు 63 ఉన్నాయి. మిగిలినవి ప్రైవేట్‌ కాలేజీలు ఉన్నాయి. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ, బీబీఎం, బీసీఏ తదితర కోర్సుల్లోని సీట్లను దోస్త్‌ ద్వారా భర్తీచేస్తారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news