వినాడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నా ఆత్మహత్య చేసుకోబోతున్న వాడిని ఫేస్ బుక్ కాపాడింది. వివరాల్లోకి వెళ్తే ఢిల్లీకి చెందిన ఒక వ్యక్తి హోటల్ లో షెఫ్ గా పని చేస్తున్నాడు. కొద్దిరోజుల క్రితం ఇంట్లో గొడవ పడడంతో అతను ముంబై వెళ్ళిపోయాడు. అయితే కొద్ది రోజులుగా భార్యతో రోజు గొడవలు పడుతుండడంతో ఆత్మహత్య చేసుకుందామని ఫిక్స్ అయ్యాడు. అయితే ఫేస్ బుక్ బాగా వాడే అలవాటున్న ఈయన ఆత్మహత్యకు సంబందించిన పిక్స్ కొన్ని షేర్ చేశాడు. దీంతో ఫేస్ బుక్ మెయిన్ ఆఫీస్ లో అలెర్ట్ వచ్చింది.
అక్కడి ఉద్యోగి ఫేస్ బుక్ అకౌంట్ కి రిజిస్టర్ అయిన నంబర్ ఢిల్లీది కావడంతో ఢిల్లీ సైబర్ పోలీసులకి సమాచారం ఇచ్చాడు. రంగంలోకి దిగిన పోలీసులకి ఆ నెంబర్ ఎవరు వాడుతున్నారు ? ఎక్కడున్నారు ? అనేది తెలిసింది. వెంటనే ముంబై పోలీసులను అలెర్ట్ చేశారు. అయితే నెంబర్ ద్వారా లొకేషన్ ట్రేస్ చేద్దామంటే అతను ఫోన్ లిఫ్ట్ చేయలేదు. అతని తల్లి ద్వారా కాల్ చేయించినా అతను ఫోన్ ఎత్తలేదు. కొద్దిసేపటికి అతనే తిరిగి కాల్ చేయడంతో రాత్రి ఒకటిన్నర సమయంలో అతని లొకేషన్ ట్రేస్ చేశారు. అతని తల్లితో ఫోన్ మాట్లాడించడంతో సక్సెస్ కావడంతో అతన్ని ట్రేస్ చేసి పట్టుకున్న పోలీసులు అతన్ని కౌన్సెలింగ్ నిమిత్తం తరలించారు.