ప్రముఖ సోషల్ నెట్ వర్కింగ్ సంస్థ ఫేస్‌బుక్ తన యూజర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలో టిక్‌టాక్ తరహాలో అందులో షార్ట్ వీడియోస్ పేరిట ఓ ఫీచర్ అందుబాటులోకి రానుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఇప్పటికే రీల్స్ పేరిట అలాంటి ఫీచర్‌ను ఫేస్‌బుక్ అందిస్తోంది. అయితే ఇదే తరహాలో త్వరలో ఫేస్‌బుక్‌లోనూ షార్ట్ వీడియోస్ ఫీచర్ అందబాటులోకి రానుంది. ప్రస్తుతం ఫేస్‌బుక్ ఈ ఫీచర్‌ను టెస్ట్ చేస్తోంది.
ఫేస్‌బుక్‌లో త్వరలో అందుబాటులోకి రానున్న షార్ట్ వీడియోస్ ఫీచర్‌ను ప్రస్తుతం కేవలం కొద్ది మంది ఎంపిక చేసిన యూజర్లతో టెస్ట్ చేస్తున్నారు. దీంతో అతి త్వరలోనే ఈ ఫీచర్‌ను యూజర్లకు అందివ్వనున్నారు. ఫేస్‌బుక్ న్యూస్ ఫీడ్‌లో ప్రత్యేకంగా ఓ సెక్షన్‌లో షార్ట్ వీడియోస్ ఫీచర్ ఉంటుంది. అందులోకి వెళ్లడం ద్వారా యూజర్లు తమ ఫేస్‌బుక్ ఫ్రెండ్స్ పెట్టిన షార్ట్ వీడియోలను చూడవచ్చు. అలాగే వారు కూడా షార్ట్ వీడియోలను ఫోన్ కెమెరా ద్వారా రికార్డు చేసి ఫేస్‌బుక్‌లోకి అప్‌లోడ్ చేయవచ్చు.
INTERESTING!
Facebook is also testing a ‘short videos’ feed with TikTok-like swipe up in its main appThis appears to be in addition to Instagram Reels
h/t @roneetm pic.twitter.com/0XHiSowCwW
— Matt Navarra (@MattNavarra) August 13, 2020
కాగా భారత్‌లో టిక్‌టాక్ యాప్ బ్యాన్ అయిన నేపథ్యంలో ఆ యాప్ యూజర్లందరూ ప్రత్యామ్నాయ యాప్‌ల మీద పడ్డారు. అందులో భాగంగానే ఫేస్‌బుక్ కూడా అలాంటి యూజర్ల కోసం ఈ ఫీచర్‌ను త్వరలో అందుబాటులోకి తేనుంది.