ఇద్దరు పిల్లలు కోలుకున్నారు, నాకు చాలా హ్యాపీగా ఉంది: నమ్రత

-

సేవా కార్యక్రమాల విషయంలో మహేష్ బాబు, ఆయన భార్య నమ్రతా ముందు వరుసలో ఉంటారు అనే సంగతి తెలిసిందే. ఇప్పటికే రెండు మూడు గ్రామాలను మహేష్ బాబు దత్తత తీసుకున్నాడు. ఇక పలువురు చిన్న పిల్లలకు కూడా సహాయం చేస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో మహేష్ భార్య నమ్రతా శిరోద్కర్‌ ఒక విషయం పంచుకున్నారు. ఆంధ్రా ఆసుపత్రి లో చిన్న పిల్లలకు ఉచిత గుండె ఆపరేషన్స్ పై స్పందించారు ఆమె.

నా హృదయాన్ని కదిలించేలా ఆంధ్ర ఆసుపత్రులతో సంబంధం కలిగి ఉండటం నాకు ఎంతో గర్వకారణం అని ఆమె అన్నారు. చిన్న పిల్లల డాక్టర్ పి.వి. రామారావు మరియు అతని నిపుణుల బృందం ఇద్దరు చిన్నారులకు ఊపిరి పోశారని కొనియాడారు. భవ్యశ్రీ మరియు సింధు కోలుకున్నారని, ఆరోగ్యం గా ఉన్నారని తెలిసి సంతోషంగా ఉందన్నారు ఆమె. బాలికలు మరియు వారి కుటుంబాలకు దీవెనలని… సురక్షితంగా ఉండండని నమ్రత పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news