ఫ్యాక్ట్ చెక్: ఇండియన్ ఆయిల్ నుండి రూ.6,000 పొందే ఛాన్స్..?

-

ఈ మధ్యన నకిలీ వార్తలు ఎక్కువగా కనపడుతున్నాయి. ఈ నకిలీ వార్తలకి దూరంగా ఉండక పోతే లేనిపోని సమస్యలు తప్పవు. సోషల్ మీడియాలో తరచు మనకి ఎన్నో నకిలీ వార్తలు కనబడుతూ ఉంటాయి. అయితే నిజానికి ఏది నిజమైన వార్త ఏది నకిలీ వార్త అని తెలుసుకోవడం కష్టం.

నకిలీ వార్తల్ని చూసి చాలా మంది మోసపోతుంటారు. పైగా వాటిని పదే పదే షేర్ చేస్తూ ఉంటారు. ఇక ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతోంది. అయితే ఆ వార్త నిజమా కాదా అసలు ఆ వార్త ఏమిటి అనే విషయాలను చూద్దాం.

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఒక మంచి అవకాశాన్ని ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఈ అవకాశంని వినియోగించుకోమని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అంటోందని ఒక వార్త వచ్చింది. ఫ్యూయల్ సబ్సిడీ గిఫ్ట్ కింద రూ.6000 ని పొందే అవకాశాన్ని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కల్పిస్తోందా..? లక్కీ డ్రా ని తీస్తోందా..? దీనిలో మనం కూడా డబ్బులు పొందొచ్చా..?

ఇక ఇందులో నిజం ఎంత అనేది చూస్తే… ఇది వట్టి నకిలీ వార్త అని తెలుస్తోంది. గిఫ్ట్ కార్డు విలువ ఆరు వేలు అని… రూ. 6000 ని పొందే అవకాశం ఇండియన్ ఆయిల్ కల్పిస్తోందని వచ్చిన వార్త ఫేక్ వార్త. ఇందులో నిజం ఏమీ లేదు కాబట్టి అనవసరంగా మోసపోకండి ఇటువంటి నకిలీ వార్తలు ఇతరులకి కూడా షేర్ చేయకండి.

Read more RELATED
Recommended to you

Latest news