తొలి వన్డేలో భారత క్రికెట్ జట్టు 67 పరుగుల తేడాతో శ్రీలంకను ఓడించింది. దీంతో మూడు వన్డేల సిరీస్ లో రోహిత్ శర్మ సారధ్యంలోని టీమిండియా 1-0 ఆదిక్యంలో నిలిచింది. అయితే ఈ మ్యాచ్ లో ఓ ఆసక్తికర సంఘటన జరిగింది. టీమిండియా నయా బౌలింగ్ సంచలనం, కశ్మీరీ ఎక్స్ప్రెస్ తన రికార్డును తానే బద్దలు కొట్టాడు. దాంతో పాటుగా అదే బంతికి లంక బ్యాటర్ అసలంక అవుట్ కాకుండానే, ఉమ్రాన్ బంతులకు భయపడి క్రిజ్ వదిలాడు.
ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. తొలి వన్డేలో ఇన్నింగ్స్ 14వ ఓవర్ లో 156 కిలోమీటర్ల వేగంతో బంతి విసిరి ఉమ్రాన్ ఈ ఘనత సాధించాడు. లంక బ్యాటర్ చరిత అసలంక ఉమ్రాన్ బంతులకు ఉక్కిరి బిక్కిరి అయ్యాడు. ఒక్కో బంతి బుల్లెట్లల దూసుకొస్తుంటే ఎలా ఆడాలో అతడికి అర్థం కాలేదు. ఇక ఈ ఓవర్ చివరి బంతికి అసలంక కీపర్ చేతికి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అయితే అక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, అసలు అసలంక బ్యాట్ కు బంతిని తాకనే లేదు. రీప్లేలో బంతి బ్యాట్ కు తాకకుండా అతడి టవల్ ను తాకుతూ వెళ్లి కీపర్ చేతుల్లో పడింది. దాంతో అవుట్ అనుకొని అతడు పెవిలియన్ కు చేరాడు.
Charith Asalanka walked off despite the ball hitting the towel#INDvSL #UmranMalik #CharithAsalanka pic.twitter.com/1dcpYGFGPg
— CricShiva (@shivauppala93) January 10, 2023