ఫ్యాక్ట్ చెక్: ప్రధాని నరేంద్ర మోడీ ఈ అగ్రిమెంట్ మీద నిజంగా సంతకం చేశారా..? సాకేత్ గోఖలే ట్వీట్ లో నిజం ఏమిటి..?

-

నకిలీ వార్తల గురించి కొత్తగా చెప్పక్కర్లేదు ఎన్నో నకిలీ వార్తలు మనకి తరచూ సోషల్ మీడియాలో కనబడుతూ ఉంటాయి. నకిలీ వార్తలని చూసి చాలా మంది నిజం అని మోసపోతూ ఉంటారు. ఏది ఏమైనాప్పటికీ నకిలీ వార్త ఏది నిజం ఏది అనేది తెలుసుకోవడం చాలా అవసరం. తాజాగా సోషల్ మీడియాలో ఒక వార్త తెగ షికార్లు కొడుతోంది. మరి అది నిజమా కాదా అనేది చూస్తే..

ప్రధాని నరేంద్ర మోడీ ఒక అగ్రిమెంట్ మీద సంతకం చేశారని యూఎస్ తో ఆయన ఒక ఎగ్రిమెంట్ మీద సంతకం చేసినట్లు సాకేత్ గోకలే ట్వీట్ చేశారు. మరి సాకేత్ చేసిన ట్వీట్ లో నిజం ఎంత..? అది నిజమా కాదా అనేది ఇప్పుడే తెలుసుకుందాం.

MQ-9B డ్రోన్స్ కోసం ప్రధాన నరేంద్ర మోడీ యూఎస్ఏ అగ్రిమెంట్ కుదుర్చుకున్నారని అందుకోసం సంతకం చేశారని. పైగా ఎంతకి కొనుగోలు చేశారు అనేది కూడా సాకేత్ ట్వీట్ లో చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ నిజంగా అగ్రిమెంట్ మీద సంతకం చేశారా ఇది నిజమా కాదా అనేది చూస్తే.. ఇది వట్టి నకిలీ వార్త అని తెలుస్తోంది ఈ వార్త లో నిజం లేదు ఇది వట్టి ఫేక్ వార్త. పీఐబీ ఫ్యాక్ట్ చెక్ కూడా దీనిపై స్పందించింది ఇది వట్టి నకిలీ వార్త అని తేల్చి చెప్పేసింది.

Read more RELATED
Recommended to you

Latest news