పుతిన్​పై తిరుగుబాటు సమయంలో.. వైట్​హౌస్​లో ఏం జరిగిందో తెలుసా..?

-

రష్యాలో ప్రైవేటు సైన్యం వాగ్నర్‌ ఆ దేశ అధ్యక్షుడు పుతిన్​పై తిరుగుబాటు చేసిన సమయంలో అమెరికాలోని వైట్​హౌస్​ అప్రమత్తమైంది. అమెరికా వద్ద వాగ్నర్ ప్లాన్​పై ముందే సమాచారం ఉండటంతో.. పరిణామాలు తీవ్రమయ్యే కొద్దీ అమెరికా ముందు జాగ్రత్తలు తీసుకొంటూ వెళ్లింది. ఈ నేపథ్యంలో ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మెక్రాన్‌, జర్మనీ ఛాన్సలర్‌ షోల్జ్‌, బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌తో ఫోన్‌ కాల్‌లో అమెరికా అధ్యక్షుడు మాట్లాడారు. ముఖ్యంగా తన మృత్యువు కోసం పశ్చిమ దేశాలు ఎదురు చూస్తున్నాయని పుతిన్‌ చేసే ఆరోపణలకు ఎటువంటి బలం చేకూర్చకుండా చూడటం ముఖ్యమని వారికి నొక్కి చెప్పారని సమాచారం. రష్యాలో ఏం జరుగుతుందో దానిని జరగనీయాలని బైడెన్‌ వారికి సూచించారని వెల్లడించాయి.

మరోవైపు అమెరికా దౌత్య బృందాలను బైడెన్‌ ముందే అప్రమత్తం చేశారు. ‘‘ఈ విషయంలో జోక్యం చేసుకొనే ఉద్దేశం అమెరికాకు లేదు’’ అని విదేశాంగ శాఖ వెల్లడించింది. తాము ఎటువంటి జోక్యం చేసుకోబోమనే సందేశాన్ని రష్యాకు కూడా పంపినట్లు ఈ విషయాన్ని దగ్గర నుంచి గమనించిన కొందరు అధికారులు అమెరికా పత్రికలకు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news