ఫ్యాక్ట్ చెక్: పాన్ నంబర్ ని అప్డేట్ చెయ్యకపోతే ఎస్బీఐ అకౌంట్ బ్లాక్ అవుతుందా..?

-

ఈ మధ్యకాలం లో నెట్టింట్లో ఫేక్ వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. నిజంగా జరిగాయేమో అని అంతా నమ్మేస్తున్నారు కూడా. ముఖ్యంగా కరోనా వైరస్ వ్యాపించడం మొదలు అయ్యినప్పటి నుండి ఇలాంటి ఫేక్ వార్తలు ఎక్కువ వస్తున్నాయి. ఈ తరహాలోనే తాజాగా సోషల్ మీడియా లో ఒక వార్త తెగ వైరల్ అవుతోంది. ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..

దేశీయ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ఫోన్ కి మెసేజ్ లు వస్తున్నాయి. ఈ మెసేజ్ లో ఏముందంటే ఈరోజు మీ పాన్ నెంబర్ ని కనుక అప్డేట్ చేసుకోకపోతే ఎస్బీఐ యోనో అకౌంట్ క్లోజ్ అయిపోతుంది అని ఆ మెసేజ్ లో ఉంది. అయితే మరి నిజంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటువంటి మెసేజ్లు పంపిస్తుంద అనేది చూస్తే…

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్స్ ని పాన్ నెంబర్ ని అప్డేట్ చేసుకోమని మెసేజ్ లు ని పంపడం లేదు. అయితే ఫోన్ కి వస్తున్న మెసేజ్లు నిజం కాదు. ఇవి ఫేక్ మాత్రమే ఇందులో ఏ మాత్రమూ నిజం లేదు. ఎస్బీఐ ఇటువంటి మెసేజ్లు ని పంపడం లేదు. మెసేజ్ల ద్వారా పర్సనల్ డీటెయిల్స్ ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పుడు అడగదు.

Read more RELATED
Recommended to you

Latest news