కరోనా వైరస్‌కు గాను రష్యా దేశం మంగళవారం ప్రపంచంలోనే తొలి వ్యాక్సిన్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని స్వయంగా ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ తెలిపారు. తన ఇద్దరు కుమార్తెల్లో ఒకరికి ఆ వ్యాక్సిన్ ఇచ్చారని, ఆమెకు స్వల్పంగా జ్వరం వచ్చిందని, ఇతర ఏ సైడ్ ఎఫెక్ట్స్ రాలేదని ఆయన తెలిపారు. తాము తయారు చేసిన వ్యాక్సిన్ సురక్షితం అని కూడా ఆయన అన్నారు. ఇక రష్యా తమ వ్యాక్సిన్‌కు స్పుత్‌నిక్ V అని కూడా నామకరణం చేసింది. అయితే ఈ వ్యాక్సిన్ ఏమో గానీ.. ఓ ఫేక్ వీడియో మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
రష్యా అధ్యక్షుడు పుతిన్ కుమార్తె వ్యాక్సిన్ తీసుకుంటుంది.. అంటూ కొందరు ఓ వీడియోను సోషల్ మాధ్యమాల్లో షేర్ చేయడం మొదలు పెట్టారు. అందులో ఓ బాలిక టీకాను తీసుకుంటున్న దృశ్యాలను మనం చూడవచ్చు. అయితే వెరిఫై చేయగా.. ఆమె పుతిన్ కుమార్తె కాదని, ఆ వీడియో ఫేక్ అని తేలింది. వ్యాక్సిన్ ట్రయల్స్‌లో ఆ బాలిక పాల్గొందని, ఆమె వీడియోను పుతిన్ కుమార్తె వీడియో అని ప్రచారం చేస్తున్నారని వెల్లడైంది.
Respect 🙏
Putin's daughter was among the volunteers for trials.#RussianVaccine #Russie pic.twitter.com/tQGjcIFcwp
— Zoya 🚨 (@Zoya_nafidi) August 11, 2020
సదరు వీడియోను చూసిన అనేక మంది అది ఫేక్ అని కూడా తేల్చారు. ఆ వీడియోలో ఉన్న బాలిక పుతిన్ కుమార్తె కాదని అంటున్నారు. ప్రస్తుత తరుణంలో కోవిడ్ పై అనేక ఫేక్ వార్తలు, వీడియోలు ప్రచారం అవుతున్నాయి. అయితే ఈ వీడియో మాత్రం చాలా త్వరంగా ప్రచారంలోకి వచ్చింది. ఏది ఏమైనా.. సోషల్ మీడియాలో షేర్ అయ్యే వార్తలు, వీడియోలను మాత్రం అంత త్వరగా నమ్మకూడదని నిర్దారణ అయింది.