కరోనా విజృంభణ నేపథ్యంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు సింపుల్ గా నిర్వహించనున్నారు. అందుకుగాను ఆగస్టు 15 నాటి ప్రధాని మోదీ షెడ్యూల్ ఖరారైంది. 7:21 నిమిషాలకు ప్రధాని ఎర్రకోటకు చేరుకుంటారు. సరిగ్గా 7:30 నిమిషాలకు జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత 45 నిమిషాల నుంచి 90 నిమిషాల మధ్య జాతినుద్దేశించి ప్రసంగిస్తారని సమాచారం. ఈసారి 22 మంది జవాన్లతోనే గౌరవ వందన కార్యక్రమం ఉంటుంది.
జాతీయ జెండాకు గౌరవ వందన చేసే వారు మాత్రం కేవలం 32 మంది జవాన్లతో పాటు 350 మంది ఢిల్లీ పోలీసులు పాల్గొననున్నారు. కాగా కార్యక్రమానికి 150 మంది అతిధులను మాత్రమే ఆహ్వానించినట్టు తెలుస్తోంది. ఈ కార్యక్రమం జరుగుతున్నంత సేపూ… అందరూ భౌతిక దురాన్ని పాటిస్తూ ఉంటారని అధికారులు స్పష్టం చేశారు. అలాగే విధ పాఠశాలలకు చెందిన విద్యార్థులను ఈ సారి మాత్రం హాజరు కావొద్దని ఆదేశాలు జారీచేశారు.