వ్యాక్సిన్‌ పేరుతో ఫోన్‌కాల్స్‌ జాగ్రత్త సుమా..

-

గతేడాది నుంచి కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. దాని కట్టడికి ప్రభుత్వాలు నానా విధాలుగా చర్యలు తీసుకున్నారు. వివిధ సంస్థలు టీకా తయారీలోనూ నిమగ్నమయ్యాయి. కొన్ని దేశాల్లో టీకాలు సైతం వేస్తున్నారు. మన వద్ద కూడా దాదాపుగా చివరి దశలో ఉన్నట్లు ప్రభుత్వాలు ప్రకటించాయి. దీంతో ఇదే అదనుగా భావించిన సైబర్‌ నేరగాళ్లు మరో కొత్త పద్ధతిని అవలంభిస్తున్నారు. ముందుగా ఫోన్లకు మెసెజ్‌లు పంపుతున్నారు.

ఆ తర్వాత ఫోన్లు చేసి ‘ కరోనా వ్యాక్సిన్‌ గురించి రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని’ అందుకు మీ ఫోన్‌ నెంబర్, లేదా ఆధార్‌ నంబర్‌ అడుగుతున్నారు. మన ఫోన్‌కు ఓ మెసెజ్‌ పంపి దానికి సంబంధించిన ‘ఓటీపీ’ నంబర్‌ ఇవ్వాలని కోరుతారు. వ్యాక్సిన్‌ అనగానే కంగారులో మన సమాచారం వారికి ఇస్తే క్షణాల్లో బ్యాంకు ఖాతాలు ఖాళీ అవుతాయిని పోలీసులు హెచ్చరిస్తున్నారు. దీంతో వివిధ రకాల ఫోన్‌ నంబర్లతో కాల్స్‌ వస్తే ఎలాంటి సమాచారం ఇవ్వరాదని, వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news