రూ.130కే 30 గుడ్లు… ఉడకబెట్టడంతో బయటపడిన అసలు విషయం

-

నెల్లూరు: నకిలీకి కాదేదీ అనర్హం అని ఓ ఘటన నిరూపించింది. కల్తీగాళ్లు అన్నింటినీ నకిలీవిగా తయారు చేస్తున్నా.. కొన్నింటికి మాత్రం మినహాయింపు ఉంటుందని అనుకున్నారు. కానీ దేన్నైనా కల్తీ చేయొచ్చని నెల్లూరులో జరిగిన ఘటన చూస్తే అర్ధమవుతోంది. ఇప్పటివరకూ బియ్యం, నూనె వంటి నిత్యావసరాలను కల్తీ చేయడం చూశాం.. ఇప్పుడు ఆ బాటలోకి గుడ్లు కూడా వచ్చిచేరిపోయాయి.  నకిలీ గుడ్లు తయారు చేసి డబ్బులు దండుకున్నారు. ఈ గుడ్లు కొని బాధితులు ముక్కుమీద వేలు వేసుకున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసి లబోదిబోమన్నారు.

తాజాగా నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం ఆండ్రావారిపల్లెలో నకిలీ కోడిగుడ్లు కలకలం రేపాయి. తెల్లగా ఉన్న కోడిగుడ్లను ఓ వ్యక్తి ఆటోలు తీసుకెళ్లి ఆండ్రావారిపలెల్లో అందరికి అమ్మారు. 30 గుడ్లను రూ.130కే అమ్మడంతో గ్రామస్తులు ఎగబడి కొన్నారు. కూర చేసుకునే సమయంలో వారంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఎంత సేపటికి ఉడక్కపోవడంతో వాటిని పరిశీలించారు. గుడ్డుపై పెంకు ప్లాస్టిక్ రూపంలో ఉండటంతో ఆశ్చర్యపోయారు. గుడ్డు లోపల ఉండే తెల్లసొన కూడా తేడాగా ఉండటంతో మోసపోయామని తెలుసుకున్నారు. వెంటనే వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. తక్కువ ధరకే వస్తున్నాయని ఏవీ కొనవద్దని, మార్కెట్ లో తెలుసుకుున్నాకే కొనుగోలు చేయాలని పోలీసులు అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news