రైలులో టెర్రరిస్టులంటూ ఫేక్ న్యూస్ .. 3గంటలు నిలిచిన రైలు!

-

పూరి టు న్యూఢిల్లీ మధ్య నడిచే పురుషోత్తం ఎక్స్‌ప్రెస్‌‌లో కొందరు ఉగ్రవాదులు ప్రయాణిస్తున్నారని, వారి వద్ద బాంబులు ఉన్నట్లు రైల్వే అధికారులకు గురువారం తెల్లవారుజామున 2:30 గంటల ప్రాంతంలో సమాచారం అందింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు యూపీలోని తుండ్ల రైల్వే స్టేషన్‌లో రైలును వెంటనే నిలిపివేశారు.సుమారు 3 గంటల పాటు సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. డాగ్ స్క్వాడ్‌ సాయంతో క్షుణ్ణంగా సోదాలు జరిపారు. లగేజీని సైతం చెక్ చేశారు. సోదాల్లో అనుమానిత వస్తువులు ఏమీ లభ్యం కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

‘ఎక్స్’ ద్వారా వచ్చిన సమాచారం అసత్యమని రైల్వే అధికారులు నిర్దారించారు. చివరగా భద్రతా ఏజెన్సీలు రైలుకు సిగ్నల్ ఇవ్వడంతో తర్వాత రైలు గమ్యస్థానానికి బయలుదేరింది. తప్పుడు సమాచారం ఇచ్చిన వ్యక్తి వివరాలు తెలుసుకునేందుకు పోలీసులు విచారణ చేపట్టారు. కాగా, గతేడాది మే 1న కూడా పూరి-న్యూఢిల్లీ పురుషోత్తం ఎక్స్‌ప్రెస్‌లో బాంబు అమర్చినట్లు సమాచారం అందగా అది ఫేక్ అని అధికారులు తేల్చారు.

Read more RELATED
Recommended to you

Latest news