దుర్గం చెరువు బ్రిడ్జ్ మీద ఫ్యామిలీ హల్చల్… దణ్ణం పెట్టిన పోలీసులు !

దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ మీద ప్రజలు యధేచ్చగా నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. పోలీసులు ఎన్ని సార్లు హెచ్చరించినా ఫోటోలు దిగేందుకు రకరకాల ఫీట్లు చేస్తున్నారు. సాహసాలు చేస్తున్నారు. తాజాగా ఓ కుటుంబం ఫోటో దిగేందుకు ప్రయత్నించి, సీసీ కెమెరాలకు అడ్డంగా దొరికిపోయింది. కుటుంబం కేబుల్ బ్రడ్జి మీద ఫోటోలు దిగడానికి బండి ఆపింది. ఆ తర్వాత బండి నంబర్ ఛలాన్ పడకూడదని అక్కడికి వచ్చిన వ్యక్తి తన భార్య చున్నీ తో నెంబర్ ప్లేట్ ను కప్పి ఫోటో దిగి ప్రయత్నం చేసింది.

దీంతో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు మైక్ లో అనౌన్స్ చేయడంతో అక్కడినుంచి పరారయ్యారు. చిన్న పిల్లలతో సహా కేబుల్ బ్రిడ్జి మధ్యలో ఆగి ఫోటోలు దిగడం ప్రమాదకరం అని తెలిసిన చాలా మంది కుటుంబాలు ఈ విధంగానే చేస్తున్నాయి. కేబుల్ బ్రిడ్జి మీద ఆగడం ట్రాఫిక్ రూల్స్ కి విరుద్ధం అయినప్పటికీ అక్కడ ఆగి చాలా మంచి ఫోటోలు దిగుతున్నారు. ఇలా చేస్తున్న వారిని దణ్ణం పెట్టి వేడుకుంటున్నా వారు మాత్రం వినడం లేదు.