బ్రేకింగ్ : గతంలో పోలీస్ శాఖ కోసం పని చేసిన దీక్షిత్ కిడ్నాపర్ !

వరంగల్‌ బాలుడు కిడ్నాప్‌, హత్య కేసులో అనేక కోణాలు బయటపడుతున్నాయి. నిందితుడు మంద సాగర్‌కు ఉన్న నేర చరిత్రకి సంబంధించి ఒక్కో విషయం బయటపడున్నాయి. నిందితుడు బావలు పోలీసుశాఖలోనే ఉండగా.. వారికంటే ఎక్కువ డబ్బులు సంపాదించాలనే కిడ్నాప్ చేసినట్టు తెలుస్తోంది. అంతే కాదు పోలీసు శాఖలో ఆరేళ్ల పాటు తాత్కాలిక డ్రైవర్‌గా పనిచేసిన సాగర్.. గతంలో కూడా ఇజ్రాయల్ యాప్‌ సాయంతో ఓ మహిళను వేదించాడు.

అప్పుడు కూడా పోలీసులకు ఫోన్‌ స్టేటస్‌ చిక్కకుండా తప్పించుకున్నాడు. ఇంకా ఆ కేసు పెండింగ్‌లోనే ఉంది. తాజా ఘటనతో సాగర్ అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. నిందితుడి బావలు ఇద్దరు పోలీసు శాఖలో కానిస్టేబుల్స్ గా ఉన్నారు. వారి కంటే తానే ఎక్కవగా డబ్బులు సంపాదించాలని ఆలోచనతోనే కిడ్నాప్ కి పధకరచన చేసినట్టు చెబుతున్నారు. దీక్షిత్ తండ్రి రంజిత్ వద్ద డబ్బులు ఉన్నాయని భావించి అతన్ని ఎంచుకున్నట్టు చెబుతున్నారు.