టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ స్కామ్ ఓ కుటుంబం ప్రాణం తీసింది. ఒకే కుటుంబంలో నలుగురు అనుమానాస్పద రీతిలో మృతి చెందిన ఘటన బెంగాల్‌లోని దుర్గాపుర్సో చోటుచేసుకుంది. మృతుల్లో ఏడాదిన్నర చిన్నారి, మరో ఆరేళ్ల బాలుడు ఉన్నాడు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతులను అమిత్ కుమార్ మొండల్ (35), రూపా మొండల్ (31).. దంపతుల పిల్లలు నిమిత్ కుమార్ మొండల్ (6), నిఖితా మొండల్(ఏడాదిన్నర వయసు)గా పోలీసులు గుర్తించారు. అమిత్ మృతదేహం సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడుతూ ఉంది. రూపా, ఆమె ఇద్దరి పిల్లలు మృతదేహాలు కింద పడి ఉన్నాయి.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
మృతుల మొబైల్లో ఓ సూసైడ్ నోట్ పోలీసులకు లభ్యమైంది. టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ కుంభకోణంలో భాగమైనవారే తమ మృతికి కారణమన్నట్లు అందులో ఓ మెసేజ్ ఉంది. స్థానికులు మాత్రం ఇది అత్మహత్య కాదని, కచ్చితంగా హత్యేనని ఆరోపిస్తున్నారు. వారి కుటుంబంలో ఆస్తి తగాదాలు ఉన్నాయని, ఆ విషయంలోనే వీరిని హత్య చేశారని ఉంటారని చెబుతున్నారు.