రేవంత్‌కు టీపీసీసీ పగ్గాలు.. కాంగ్రెస్ సీనియర్ నేత రాజీనామా

-

హైదరాబాద్: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డి‌ని ఏఐసీసీ ప్రకటించింది. దీంతో తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారు. తాజాగా మాజీ ఎమ్మెల్యే కె. లక్ష్మారెడ్డి రాజీనామా చేశారు. పార్టీ అధిష్టానానికి ఆయన లేఖ రాశారు.

రేవంత్‌కు టీపీసీసీ ప్రచారం జరుగుతున్నప్పటి నుంచి లక్ష్మారెడ్డి వ్యతిరేకిస్తున్నారు. రేవంత్‌ను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ హైకమాండ్‌కు చాలా లేఖలు కూడా రాశారు. అయినా రేవంత్‌కు టీపీసీసీ పగ్గాలు ఇవ్వడంతో ఆయన మనస్థాపం చెందినట్లు సమాచారం. పార్టీ కార్యకర్తల అభిప్రాయం తీసుకున్న తర్వాతే రాజీనామా నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.

 

అయితే లక్ష్మారెడ్డిని బుజ్జగించేందుకు ఇప్పటికే కాంగ్రెస్ నేతలు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. రాజీనామా లేఖను వెనక్కి తీసుకునేలా లక్ష్మారెడ్డిని ఒప్పిస్తారని పలువురు అంటున్నారు. ఇక రేవంత్ కూడా లక్ష్మారెడ్డితో మాట్లాడతారని టాక్ వినిపిస్తోంది. మరి లక్ష్మారెడ్డిని ఎలా సంతృప్తి పరుస్తారో చూడాల్సి ఉంది. మరోవైపు లక్ష్మారెడ్డి బాటలో మరికొంత మంది కాంగ్రెస్ సీనియర్ నేతలు ఉన్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news