ప్రముఖ సంగీత దర్శకుడు కన్నుమూత..!

-

ఈ సంవత్సరం చిత్ర పరిశ్రమకు కలిసి రాలేదనే చెప్పాలి. ఇప్పటికీ సినిమా ఇండస్ట్రీలో వరస విషాదాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా మరో దారుణం జరిగింది. ప్రముఖ మరాఠీ సంగీత దర్శకుడు నరేంద్ర భిడే గుండెపోటుతో కన్నుమూశాడు. మరాఠీ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నప్రముఖ సంగీత దర్శకుడు నరేంద్ర భిడే కన్నుమూసాడు. కేవలం 47 సంవత్సరాల వయసులోనే ఈయన మరణించడం అందర్నీ కంటతడి పెట్టిస్తుంది.

bhide
bhide

ఇక ఆయనకు మారాఠీ సినిమాల్లో ఈయనకు చాలా ఫాలోయింగ్ ఉంది. అక్కడ ఈయన స్వరపరిచిన పాటలు సంచలనం. ముఖ్యంగా చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అన్ని వయసుల వాళ్లను ఆకట్టుకునేలా పాటలు కంపోజ్ చేయడంలో నరేంద్ర భిడే ఆరితేరిపోయాడు. అలాంటి వ్యక్తి గుండెపోటుతో హఠాన్మరణం చెందడం జీర్ణించుకోలేకపోతున్నారు సినీ ప్రముఖులు. చిన్నా పెద్ద హీరోలందరితోనూ పని చేసాడు. 2015లోనే వచ్చిన ఏ పేయింగ్ గోస్ట్ లాంటి నాటకాలతో పాటు డియోల్ బ్యాండ్, బయోస్కోప్, ఉబూన్‌ టు, పుష్పక్‌ విమాన్‌, హరిశ్చంద్ర ఫ్యాక్టరీ, సానే గురూజీ, సరివర్ సారీ, ముల్షీ పాట్రన్‌ వంటి చిత్రాలకు సంగీతం అందించాడు నరేంద్ర భిడే.

ఈయన పాటలు సంచలనం రేపాయి అక్కడ. అంతేకాదు నాటకాలు, సీరియల్స్, జింగిల్స్‌తో తనదైన ముద్ర వేసాడు నరేంద్ర భిడే. అలాగే మరాఠీ ఇండస్ట్రీలో ఇచ్చే జీ గౌరవ్ అవార్డును 5 సార్లు సొంతం చేసుకున్నాడు నరేంద్ర భిడే. దాంతో పాటు సహ్యాద్రి సినీ అవార్డు ఓసారి.. స్టేట్ డ్రామా అవార్డు రెండు సార్లు.. వి శాంతారామ్ అవార్డు, శ్రీకాంత్ ఠాక్రే అవార్డు, ఎం.ఎ. ఆనర్స్, స్టేట్ ఫిల్మ్ అవార్డులను ఒక్కోసారి సొంతం చేసుకున్నాడు ఈయన. బంగారం లాంటి భవిష్యత్తు ఉన్న నరేంద్ర భిడే అర్ధాంతరంగా మరణించడాన్ని మరాఠీ చిత్ర పరిశ్రమ తట్టుకోలేపోతుంది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవున్ని కోరుకుంటున్నట్లు తెలిపారు అక్కడి హీరోలు.

Read more RELATED
Recommended to you

Latest news