బాలయ్య వస్తేనే పెళ్లి చేసుకుంటా.. పట్టుబట్టిన ఫ్యాన్

-

సినిమా హీరోలంటే ఇష్టపడని వారెవరు ఉంటారు చెప్పండి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో సినీ అభిమానులకు హీరోలు, వారి కుటుంబాలంటే ఎంతో ప్రేమ. ముఖ్యంగా నందమూరి ఫ్యామిలీకి టాలీవుడ్‌లో క్రేజ్ ఎక్కువ. అందులోనూ బాలయ్య బాబు అంటే చాలామంది ఇష్టపడుతుంటారు. అలాంటి ఓ అభిమాని బాలకృష్ణ వస్తేనే పెళ్లి చేసుకుంటానని భీష్మించుకు కూర్చున్నాడు. ఇవాళే అతడి పెళ్లి. మరి బాలయ్య ఈ వేడుకకు వస్తారా లేదా అని ఆ ఊరు వాళ్లంతా వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.

ఏపీలోని విశాఖ జిల్లా పెందుర్తి మండలం చింతలగ్రహారానికి చెందిన మాజీ సర్పంచి పొలమరశెట్టి వెంకటరమణ, ఆయన కుమారుడు పెద్దినాయుడు, అతడి కుటుంబ సభ్యులు బాలకృష్ణకు వీరాభిమానులు. రెండేళ్ల క్రితం పెద్దినాయుడుకు గౌతమీప్రియతో నిశ్చితార్థం జరిగింది. బాలకృష్ణ సమక్షంలో పెళ్లి చేసుకోవాలని పెద్దినాయుడు నిర్ణయించుకున్నారు. అప్పట్లో కరోనా వల్ల బాలకృష్ణ వచ్చేందుకు అవకాశం లేదని ఏకంగా పెళ్లిని పోస్టుపోన్ చేసుకున్నారు.

పెళ్లికి ఎలాగైనా బాలయ్యను తీసుకురావాలని బాలకృష్ణ ఫ్యాన్స్‌ జిల్లా అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, టీడీపీ నాయకులను కలిసి విషయాన్ని తెలిపారు. ముందుగా ముహూర్తం ఖరారు చేసుకుని రావాలని వారు సూచించడంతో ఈనెల 11న ముహూర్తం నిర్ణయించి పెళ్లిపత్రిక అచ్చు వేయించారు. ఆ పత్రికలోనూ ఎన్టీఆర్‌, బాలయ్య చిత్రాలను ముద్రించారు. ఇవాళే వివాహం.. ఈ సందడితో ప్రస్తుతం ఊరు ఊరంతా బాలకృష్ణ రాక కోసం ఎదురుచూస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news