బేబమ్మను అసహ్యించుకుంటున్న అభిమానులు.. ఇంతకీ ఏం చేసిందబ్బా..?

-

ప్రముఖ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సనా దర్శకత్వంలో వచ్చిన మొదటి సినిమా ఉప్పెన .ఇక ఈ సినిమాతో మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ అలాగే కన్నడ బ్యూటీ కృతి శెట్టి హీరో హీరోయిన్లుగా తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఇక మొదటి పరిచయంతోనే మంచి గుర్తింపును తెచ్చుకున్న వీరిద్దరూ ఓవర్ నైట్ లోనే స్టార్స్ గా గుర్తింపు తెచ్చుకోవడం గమనార్హం. ఇక ఈ సినిమా వైష్ణవ తేజ్ కు పెద్దగా కలిసి రాకపోయినా బేబమ్మకు మాత్రం బాగా కలిసి వచ్చిందని చెప్పవచ్చు. ఇక ఈ సినిమా తర్వాత ఆమె చేసిన బంగార్రాజు , శ్యాం సింగరాయ్ వంటి సినిమాలతో హ్యాట్రిక్ విజయాన్ని అందుకున్న తర్వాత ఈమెకు మరిన్ని అవకాశాలు వెల్లువలా వచ్చి పడుతున్నాయి.

కానీ ఇటీవల రామ్ తో కలిసి నటించిన దివారియర్ సినిమా అనుకున్నంత స్థాయిలో విజయాన్ని అందించలేదు. ఇక ఇప్పుడు ఈమె చేతిలో నాగ చైతన్యతో ఒక సినిమా , సుధీర్ బాబుతో మరొక సినిమా, ఆ తర్వాత మాచర్ల నియోజకవర్గం వంటి సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు ఈ ముద్దుగుమ్మ. ఇదిలా ఉండగా బాలనటిగా తన కెరీర్ ను మొదలుపెట్టిన కృతి శెట్టి పలు వాణిజ్య ప్రకటనలలో నటించింది .ఇక అక్కడ లభించిన క్రేజ్ ను ఉపయోగించి..ఆమె సీరియల్ ప్రకటనలో జువెలరీ ప్రకటనలో కూడా నటించింది. ఇకపోతే తాజాగా సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈమె ఫోటో షూట్ లంటూ పెద్ద సందడి చేస్తోంది.

ఇకపోతే తాజాగా అభిమానులు ఆమెను చూసి అసహ్యించుకుంటున్నారు. అసలు విషయం ఏమిటంటే తనకు సంబంధించిన ఒక ఇంటర్వ్యూ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇందులో యాంకర్ నీ వాల్ పేపర్ ఏంటి అని అడగడంతో వెంటనే కృతశెట్టి కొరియన్ కు చెందిన బిటిఎస్ వాళ్ళ లైన్ ను వాల్ పేపర్ గా పెట్టుకుంది. దీంతో ఆ వీడియో చూసిన నెటిజన్స్ కూడా ఆమెకు అసహ్యించుకుంటున్నారు. నీకు చాలా తెలివి ఉందనుకున్నాము కానీ మన దేశంలో ఎంతమంది ఉన్నా వాళ్ళని ఎందుకు వాల్ పేపర్ గా పెట్టుకున్నావు.. అంటూ ఆమెపై ట్రోల్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news