శంషాబాద్ ఎయిర్ పోర్టులో 25 లక్షల నిషేధిత e- సిగరెట్ల పట్టివేత

-

ప్రస్తుత కాలంలో టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందడం వల్ల కొంతవరకు ఉపయోగాలు ఉన్నప్పటికీ.. ఈ టెక్నాలజీ వల్ల అంతే నష్టాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు వస్తున్న సినిమాలను చూస్తూ చాలామంది ఎన్నో నేరాలకు పాల్పడుతున్నారు. ఎంతోమంది మత్తు పదార్థాలు, బంగారం, వజ్రాలు వంటి వాటిని స్మగ్లింగ్ చేస్తూ అడ్డంగా దొరికిపోతున్నారు. ఇలా స్మగ్లింగ్ చేసే వారికి అడ్డుకట్ట వేయడానికి పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకున్నా నూతన పద్ధతిలో స్మగ్లింగ్ కి పాల్పడుతున్నారు.

నిషేధిత e – సిగరెట్లు స్మగ్లింగ్ చేస్తూ శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో ఐదు మంది ప్రయాణికులను అదుపులోకి తీసుకున్నారు కస్టమ్స్ అధికారులు.EK-526, 6E-1406 రెండు వేరు వేరు విమానంలో దుబాయ్ నుండి హైదరాబాద్ వచ్చిన ఐదు మంది ప్రయాణికులను అదుపులోకి తీసుకున్నారు.ప్రయాణికుల వద్ద 25 లక్షల విలువచేసే నిషేదిత e-సిగరేట్లను పట్టుకున్నారు.నిందితులు సిగరేట్లను తమ లగేజీలోని లోపలి భాగంలో దాచుకుని వస్తుండగా కస్టమ్స్ అధికారులు గుర్తించారు.
సిగరేట్లను స్వాధీనం చేసుకున్న కస్టమ్స్ అధికారులు నిందితులను విచారణ చేపట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news