రైతు ఉద్యమానికి ఏడాది.. రేపు భారత్ బందుకు పిలుపు

-

కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో నిరసన జరుగుతూనే ఉంది. ఏడాది కాలంగా జరుగుతున్నా ఈ నిరసన కార్యక్రమం ఇంకా కొనసాగుతూనే ఉంది. గత ఏడాది సెప్టెంబరు 26వ తేదీన నిరసన ఉద్యమం మొదలైంది. కొత్తగా తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాల వల్ల రైతులకు నష్టం కలుగుతుందని, వాటివల్ల వ్యాపార వేత్తల కింద బానిసలుగా మారాల్సి వస్తుందని, రైతులకు స్వేఛ్చ ఉండదని, అందువల్ల వాటిని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో రేపు భారత్ బందుకు సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు ఇచ్చింది. ఈ భారత్ బందుకు బ్యాంకులు, వ్యవసాయ, కార్మిక సంఘాలు, బ్యాంకు యూనియన్లు మద్దతు తెలుపుతున్నాయి. ఈ భారత్ బందుకు ఆంధ్రప్రదేశ్, కేరళ, పంజాబ్ ప్రభుత్వాలతో పాటు పలు రాజకీయ పార్టీలు మద్దతు తెలుపుతున్నాయి. ఏడాదిగా కొనసాగుతున్న నిరసన ఎక్కడిదాకా వెళ్తుందో, అనుకున్న ప్రతిఫలం సాధిస్తుందో లేదో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news