Chiranjeevi bhola shankar updates:మరోసారి చిరు చిందులు వేయ‌నున్న మిల్క్ బ్యూటీ!

-

Chiranjeevi bhola shankar updates: పాలిటిక్స్ తరువాత రీఏంట్రీ మెగాస్టార్ చిరంజీవి.. సెకండ్ ఇన్నింగ్స్‌లో కుర్ర హీరోల‌కు ఏమాత్రం త‌గ్గ‌కుండా వ‌రుస పెట్టి సినిమాలు చేస్తూ దూసుక‌పోతున్నారు. ఇప్ప‌టికే కొరటాల శివ డైరెక్ష‌న్‌లో ‘ఆచార్య’ సినిమాను పూర్తి .. విడుద‌ల‌కు సిద్దం చేస్తున్నారు. ఈ చిత్రంలో చిరంజీవి, రామ్ చరణ్ మాజీ నక్సలైట్స్ గా కనిపించనున్నారు. ఇక ఇటీవల చిరంజీవి బర్త్ డే సంద‌ర్భంగా గాడ్ ఫాదర్ (God Father) అనే చిత్రాన్ని ప్రారంభించారు. రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయ్యింది. లూసిఫ‌ర్ చిత్రానికి రీమేక్ ఇది.

 

 

ఇప్పుడు ఈ మూవీ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు మెగాసార్ట్‌. అస‌లు త‌గ్గేదేలే అన్న‌ట్టు.. మెహ‌ర్ ర‌మేశ్ ద‌ర్శ‌క‌త్వంలో మ‌రో చిత్రానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. ఈ చిత్రానికి ‘భోళా శంక‌ర్‌’ అని టైటిల్ ఖ‌రారు చేశారు. ఈ చిత్రం కూడా త‌మిళ ‘వేదాళం’కు రీమేక్‌. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు ప్రస్తుతం శ‌రవేగంగా జ‌రుగుతున్నాయి. సిస్ట‌ర్ సెంటిమెంట్ తో సాగే ఈ చిత్రంలో ఇందులో చిరంజీవి పాత్రకు ఓ చెల్లెలుగా కీర్తీ సురేష్‌ చేయనున్నారు.

ఇదిలా ఉంటే.. చిరు స‌ర‌స‌న ఎవ‌రూ న‌టించ‌నున్నారేది .. చాలా ఆస‌క్తిగా మారింది. గతంలో చిరంజీవితో సైరా న‌ర‌సింహారెడ్డిలో త‌మ‌న్నా న‌టించిన విష‌యం తెలిసిందే. ఈ సినిమాలో ఆమెది చిన్న క్యారెక్ట‌ర్ అయినా.. ఆమె న‌టన‌తో అంద‌రి మదిని గెలుచుకుంది. సినీ ప్ర‌ముఖ‌ల ప్ర‌శంస‌లు పొందింది. దీంతో చిరుకు హీరోయిన్ గా త‌మ‌న్నానే సెట్ అవుతుంద‌ని భావించిన‌ మూవీ మేక‌ర్స్ కథానాయికగా ఆమెను ఎంపిక చేశారని సమాచారం.

దీనికి త‌మ‌న్నా కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్. ఈ టాక్ నిజ‌మైతే.. ‘సైరా’ తర్వాత మరోసారి చిరంజీవితో స్క్రీన్‌ షేర్‌ చేసుకునే అవ‌కాశం ద‌క్కుతుంది త‌మ‌న్నాకు. అయితే సైరా న‌ర‌సింహారెడ్డి విమర్శకుల ప్రశంసలు అందుకుంది తప్ప.. కలెక్షన్లు మాత్రం ఆశించిన స్థాయిలో రాలేదు. మ‌రి ఈసారి చిరు-త‌మ‌న్నా కాంబో హిట్ కొడుతుందేమో వేచి చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news