ట్రావెల్: నిషేధం ఎత్తేసిన కెనడా.. కొత్త నిబంధనలివే..

-

ప్రయాణ ఆంక్షలను కెనడా ప్రభుత్వం తొలగించింది. ఇండియా నుండి రాకపోకలకు అనుమతి ఇచ్చింది. సెప్టెంబరు 26వ తేదీ వరకు ఉన్న ఈ ఆంక్షలు 27వ తేదీ నుండి తొలగిపోనున్నాయి. కరోనా వైరస్ కారణంగా వచ్చిన ఈ ఆంక్షలకు అడ్డు పరదా తొలగించి ప్రయాణానికి పచ్చ జెండా ఊపింది. ఈ నేపథ్యంలో ఎయిర్ కెనడా తన విమానాలను సెప్టెంబరు 27వ తేదీ నుండి ప్రారంభించనుంది. అలాగే ఎయిర్ ఇండియా ఇండియా నుండి తన విమానాలను సెప్టెంబరు 30వ తేదీ నుండి మొదలు పెట్టనుంది.

కెనడా ప్రయాణానికి పెట్టిన నిబంధనలు

ఎవరైతే కెనడా వెళ్ళాలని అనుకుంటున్నారో వారు ఖచ్చితంగా కోవిడ్ నెగెటివ్ రిపోర్టు కలిగి ఉండాలి. ఆర్టీపీసీఆర్ టెస్టుతో అది కూడా ప్రభుత్వం గుర్తించిన పేరున్న డయాగ్నోస్టిక్ సెంటర్ నుండి‌ ఉండాలి.

బోర్డింగ్ వద్ద టెస్టు సర్టిఫికేట్ ను గమనించి, మీకు కెనడా వెళ్ళే అనుమతి ఉందా లేదా అన్న నిర్ణయం తీసుకుంటారు.

వ్యాక్సిన్ రెండు డోసులు పూర్తి చేసుకున్నవారు దాని తాలూకు సర్టిఫికేట్ ను వివరాలను ArriveCAN మొబైల్ యాప్ లో పొందుపర్చాల్సి ఉంటుంది.

అలాగే వయా వేరే దేశంగా కెనడా వచ్చేవాళ్ళు ఆ దేశంలో కోవిడ్ పరీక్ష చేసుకుని నెగెటివ్ సర్టిఫికేట్ పొంది ఉండాలి.

 

Read more RELATED
Recommended to you

Latest news