రాత్రికి రాత్రే లక్షాధికారైన రైతు.. ఎలాగంటే..?

-

ఓడలు బళ్ళవుతాయి.. బళ్ళు ఓడలవుతాయి అంటే ఇదే కావచ్చు. కాలం కలసిసోచ్చి ఓ రైతు రాత్రికి రాత్రే లక్షాధికారి అయ్యాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని పన్నా జిల్లాలో చోటు చేసుకుంది. ఓ భూమిని ప్రతాప్ సింగ్ అనే రైతు లీజుకు తీసుకుని 3 నెలలుగా వజ్రాల కోసం తవ్వుతున్నాడు. ఈ క్రమంలో తాజాగా అతడికి 11.88 క్యారెట్ల బరువున్న వజ్రం దొరికింది. ఈ విషయాన్ని వజ్రాల కార్యాలయం అధికారి రవి పటేల్ వెల్లడించారు. అంతేకాకుండా.. ఈ వజ్రం ఎంతో నాణ్యంగా ఉందని.. అదృష్టం ఎప్పుడు ఎలా వరిస్తుందో చెప్పలేమన్నారు. మూడు నెలల కష్టానికి ప్రతిఫలం దక్కిందని.. రైతు ప్రతాప్ సింగ్ యాదవ్ అన్నారు.

ఈ సందర్భంగా రైతు ప్రతాప్‌ సింగ్‌ మాట్లాడుతూ.. తనకు దొరికిన వజ్రాన్ని డైమండ్ కార్యాలయంలో అప్పగించినట్లు పేర్కొన్నారు. వేలంలో వచ్చిన డబ్బుతో ఏదైనా వ్యాపారం పెట్టుకుంటాన్న ప్రతాప్‌ సింగ్‌.. అలాగే, తన పిల్లల చదువుల కోసం కొంత ఖర్చు చేస్తానని వివరించాడు. ఈ వజ్రాన్ని వేలం వేయడం ద్వారా వచ్చిన సొమ్ములో రాయల్టీ, పన్నులు మినహాయించుకుని మిగతా మొత్తాన్ని ప్రభుత్వం రైతుకు అందజేయనుంది. అయితే సుమారు రూ.50లక్షల వరకు రైతు ప్రతాప్‌సింగ్‌కు అందుతుందని అంచనా వేస్తున్నారు అధికారులు.

Read more RELATED
Recommended to you

Latest news