అప్పుల బాధతో రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన గీసుగొండ మండలంలోని మొగిలిచర్ల గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మంచాల ఈశ్వరయ్య (45) తనకున్న రెండెకరాల భూమితో పాటు మరో 2ఎకరాల్లో పత్తి, మొక్కజొన్న సాగు చేశాడు. అయితే పంట దిగుబడి రాకపోవడం, ఇటీవల తన కూతురి పెళ్లి చేయడంతో అప్పులు పెరిగిపోయాయి. దీంతో మనస్థాపంతో డిసెంబర్ 31న పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. చికిత్స పొందుతూ మృతి చెందాడు.