తెలంగాణ ఆర్థిక, వైద్య శాఖ మంత్రి హారీష్ రావు కు ఊహించని షాక్ తగిలింది. మంత్రి హారీష్ రావు కాన్వాయ్ ని రైతులు అడ్డుకున్నారు. మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం నాందేడ్ – అఖోల 161వ. జాతీయ రహదారి పై మంత్రి హరీష్ రావు కాన్వాయిని అడ్డుకున్నారు రైతులు. ఈ నేపథ్యంలోనే….కారు దిగి రైతులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు మంత్రి హరీష్ రావు.
కొనుగోలు కేంద్రాల వద్ద నిల్వ ఉంచిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని రైతులకు ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు వాగ్దానం చేశారు. కొను గోళల్లో రైతులకు ఇబ్బందులు కలిగించకుండా వరి దాన్యం కొనుగోలు చెయ్యాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కొనుగోలు కేంద్రాల వద్ద నిల్వ ఉంచిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని రైతులకు భరోసా కల్పించారు. కేంద్ర ప్రభుత్వ వైఖరి కారణంగానే… తెలంగాణ రాష్ట్రంలో ఈ పరిస్థితి నెలకొందని మంత్రి హారీష్ రావు అన్నారు. రైతులు ఎవరూ కూడా ఆందోళన చెందనవసరం లేదని తెలిపారు.