ప్రొద్దుతిరుగుడు సాగులో రైతులు తప్పనిసరిగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు..!

-

మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా వేరుశనగ సాగు చేస్తారు. ఆ తర్వాత నూనె గింజల సాగు లో పొద్దుతిరుగుడుని ఎక్కువగా సాగు చేయడం జరుగుతోంది. అన్ని కాలాల్లో కూడా ఈ సాగుకు అనుకూలంగా ఉంటుంది. పైగా దీనికి పెట్టుబడి కూడా చాలా తక్కువ. తక్కువ కాలపరిమితితో ఉండడం వల్ల ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తూ ఉంటారు.

 

అయితే రైతులు పొద్దుతిరుగుడు పంట సాగు విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే పలు సమస్యల వలన పంటకు నష్టం వాటిల్లే అవకాశం ఉంటుంది. అయితే చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే మంచిగా దిగుబడి వస్తుంది.

పొద్దుతిరుగుడు సాగులో ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయన్న దాని గురించి ఇప్పుడు చూద్దాం. మరి ఇక ఎటువంటి ఆలస్యం లేకుండా దీనికోసం చూసేయండి. ఏ పంటకైనా సరే ఎదో ఒక ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది. అదే విధంగా ప్రొద్దుతిరుగుడు సాగులో కూడా రైతులు సమస్యలని ఎదుర్కొనే అవకాశం వుంది. ఇక అవేమిటీ అనేది చూస్తే..

బూడిద తెగులు: ఆకులపైన, ఆకుల అడుగుభాగాన బూడిద వంటి పొడితో కప్పబడి ఉంటాయి. తేము ఎక్కువగా ఉండి వేడి వాతావరణంలో ఈ సమస్య వస్తుంది. ఈ సమస్య నుండి బయట పడాలంటే లీటరు నీటికి 3 గ్రాములు నీటిలో కరిగే గంధకపు పొడి లేదా 1 మి.లీ, డైనోకాప్ లేదా 2 మి.లీ, హెక్సాకొనజోల్ కలిపి పిచికారి చెయ్యాలి.

రసం పీల్చే పురుగులు: 5 నుంచి 6 ఆకుల దశ నుంచి రసం పీల్చే పురుగులు ఆశించే అవకాశం ఉంది. పురుగులు ఆకులలో రసం పీల్చి మొక్కలు గిడసబారి పోయేలా చేస్తాయి. ఈ సమస్య నుండి బయట పడాలంటే ఇమిడాక్లోప్రిడ్‌ 8 గ్రా. కిలో విత్తనానికి పట్టించి విత్తన శుద్ధి చేసుకోవడం ద్వారా నాటిన 20-30 రోజుల వరకు రసంపీల్చే పురుగుల ఉధృతిని తగ్గించుకోవచ్చు.

నెక్రోసిస్ తెగులు: ఇమిడాక్లోప్రిడ్ 0.4 మి.లీ లేదా థయోమిథాక్సామ్ 0.5 గ్రా. లీటరు నీటికి కలిపి రెండు సార్లు పిచికారి చేస్తే ఈ సమస్య ఉండదు.

పొగాకు లద్దెపురుగు: ఈ సమస్య ఎక్కువగా ఉంటే నొవాల్యూరాన్ 1 మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. లేదు అంటే విషపు ఎరను 5 కి. తౌడు + 1/2 కిలో బెల్లం + 1/2 లీ. మోనోక్రోటోపాస్ లేదా క్లోరిపైరిఫాస్ ఉండలుగా తయారుచేసి పొలంలో వేస్తె మంచిది.

 

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news