దేశ రాజధాని సరిహద్దుల్లో నూతనంగా తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలపై రైతులు నిరసన చేపడుతున్న సంగతి తెలిసిందే. సంయుక్త కిసాన్ మోర్చ ఆధ్వర్యంలో చాలా రోజులుగా ఈ నిరసనలు జరుగుతున్నాయి. వ్యవసాయ చట్టాల వల్ల రైతులు నష్టపోతారని, దానివల్ల కార్పోరేట్ కంపెనీలకి బానిసలుగా మారతారని, దేశావ్యాప్తంగా రైతులందరూ నిరసన ప్రకటిస్తున్నారు. ఐతే తాజాగా ఈ నిరసన కార్యక్రమం పార్లెమెంటు సమీపానికి చేరుకోనుంది.
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన కార్యక్రమం చేయడానికి ఢిల్లీ లెఫ్టనెంట్ గవర్నర్ అనుమతులు ఇచ్చారు. కేవలం 200మంది రైతులతో మాత్రమే నిరసన తెలపవచ్చని, అంతకుమింది అనుమతించేది లేదని హెచ్చరికలు జారీ చేసారు. ఈ మేరకు కిసాన్ మోర్చ అధ్యక్షుడు రాకేష్ టికాయత్ ఆధ్వర్యంలో జంతర్ మంతర్ వద్ద నిరసన జరగనుంది. కోవిడ్ నిబంధనలు పాటిస్తూనే నిరసనలు చేపడతామని రాకేష్ టికాయత్ పేర్కొన్నారు.