నూతన రైతు చట్టాలను రద్దు చేయాలంటూ రైతులు చేస్తున్న ఆందోళనలు రోజుల తరబబడి కొనసాగుతూనే ఉన్నాయి. ఈరోజు కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ఇవాళ మధ్యాహ్నం రైతు సంఘాలతో చర్చలు జరుపుతారు. ఇది ఆరవ విడత చర్చలు అని చెప్పచ్చు. కేంద్రం ముందు నాలుగు డిమాండ్‌లు పెట్టాయి రైతు సంఘాలు.
మూడు కొత్త వ్యవసాయ చట్టాల రద్దు, కనీస మద్దతు ధరపై చట్టబద్ధమైన హామీ, ప్రభుత్వ ఆధ్వర్యంలోనే పంటల కొనుగోలు, విద్యుత్ చట్ట సవరణ బిల్లులు లాంటి నాలుగు అంశాలపై చర్చించాలని సూచించారు రైతు సంఘాల నేతలు. మరో వైపు వ్యవసాయ చట్టాలను రద్దు చేసే వరకు ఆందోళన చేస్తూనే ఉంటామని రైతులు ఖరాఖండీగా చెబుతున్నారు. ఇవాళ సింఘు సరిహద్దు దగ్గర భారీ ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించనున్నాయి రైతు సంఘాలు.