కన్న పిల్లలను తల్లి తండ్రులను తీసుకుని వలస వెళ్ళిన కూలీల పరిస్థితి దారుణంగా ఉంది. రోజు రోజుకి కరోనా కేసులు తీవ్రమవుతున్న తరుణంలో పరిస్థితి ఆందోళనకరంగా మారుతుంది. దీనితో లాక్ డౌన్ ని కఠినం గా అమలు చేస్తున్నాయి ప్రభుత్వాలు. రవాణా మార్గాలు అంటూ ఏ ఒక్కటి కూడా ఇప్పుడు అందుబాటులో లేవు అనేది అర్ధమవుతుంది. ఒక్క వాహనం కూడా ఇప్పుడు కదలడం లేదు.
దీనితో ఇప్పుడు వలస కూలీలు తన వాళ్ళను తీసుకుని వందల కిలోమీటర్లు ప్రయాణం చేస్తున్నారు. ఈశాన్య రాష్ట్రాలకు, ఉత్తరాది రాష్ట్రాలకు ఇప్పుడు ప్రయాణం చేస్తున్నారు. తాజాగా ఒక సంఘటన వెలుగులోకి వచ్చింది. కొడుకుని ఎత్తుకుని ఒక తండ్రి ఏకంగా 500 కిలోమీటర్లు నడవడం నిజంగా కన్నీరు పెట్టిస్తుంది. దయారామ్ అనే వ్యక్తి… ఢిల్లీలో ఇటుక రవాణా పనులకు వెళ్ళాడు.
అతని సొంత రాష్ట్రం మధ్యప్రదేశ్. ఢిల్లీ నుంచి అతని ఊరు 500 కిలోమీటర్లు. మార్చి 26 న భార్య కొడుకుతో కలిసి ఢిల్లీ నుంచి నడక ప్రారంభించాడు. నడక తో ప్రయాణించి మధ్యప్రదేశ్ లోని వారి గ్రామంలోని సొంత ఇంటికి చేరుకున్నారు. దయారామ్ ప్రస్తుతం గ్రామంలోని పొలాలలో రోజు వారీ కూలీ చేస్తున్నాడు. అరకొర వేతనం తో అతను పని చేయడంతో కుటుంబం మొత్తం ఇప్పుడు ఇబ్బంది పడుతుంది.