ఆగస్టు నుంచి నాని కొత్త సినిమా “శ్యామ్ సింగ రాయ్” …!

-

విజయ్ దేవరకొండ తో తెరకెక్కించిన టాక్సీవాలా సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు రాహుల్ సంకృత్యన్. ఈ సినిమా గీతా ఆర్ట్స్ బ్యానర్ లో నిరించారు. మొదట్లో కొన్నాళ్ళు రిలీజ్ కాకుండా ఆగినప్పటికి గీత గోవిందం తర్వాత రిలీజ్ అయి మంచి సక్సస్ ని అందుకుంది. అటకెక్కింది అనుకున్న ఈ సినిమా మంచి వసూళ్ళని రాబట్టింది. అంతేకాదు డైరెక్టర్ గా రాహుల్ సంకృత్యన్ కి మంచి పేరు సంపాదించి పెట్టింది. దాంతో తన నెక్స్ట్ సినిమాని నేచురల్ స్టార్ నాని తో చేస్తున్నాడు.

 

అయితే ఈ సినిమా గత మూడు నెలల క్రితమే అనౌన్స్ అయింది. ఈ సినిమాకి ‘శ్యామ్ సింగ రాయ్’ అన్న టైటిల్ ని ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే. సప్సెన్స్ థ్రిల్లర్ బ్యాగ్డ్రాప్ లో తెరకెక్కనుంది. రాహుల్ సంకృత్యన్ ఫస్ట్ విజయ్ దేవరకొండతో తీసిన టాక్సీవాలా కూడా సస్పెన్స్ త్రిల్లరే. ఇక ఈ సినిమాని ఆగష్టు నుండి సెట్స్ పైకి తీసుకువెళ్లాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. సితార ఎంటర్ టైన్ మెంట్స్ పై నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. త్వరలో ఈ సినిమాకి సంబంధించిన మిగతా విషయాలు వెల్లడించనున్నారట.

ప్రస్తుతం నాని 25వ సినిమా వి తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో నాని, సుధీర్, నివేదా థామస్, అదితి రావు హైదరి నటించిన ఈ సినిమా ఇప్పటికే రిలీ కావాల్సి ఉండగా కరోనా కారణంగా రిలీజ్ వాయిదా పడిన విషయం అందరికి తెలిసిందే. ఇక ఈ సినిమా తర్వాత నాని ‘టక్ జగదీష్’ సినిమా లో నటిస్తున్నాడు. ఇపటికే ఈ సినిమా కొంత టాకీ పార్ట్ కూడా షూటింగ్ జరుపుకుంది. లాక్ డౌన్ నేపథ్యంలో ప్రస్తుతానికి బ్రేక్ ఇచ్చారు. నిన్ను కోరి, మజిలీ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన శివ నిర్వాణ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news