ఫిబ్రవరి 2 మంగళవారం: రాశి ఫలాలు మరియు పరిహారాలు

-

శ్రీరామ పుష్యమాసం – ఫిబ్రవరి – 2-  మంగళవారం.

 

మేష రాశి:నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం !

విద్యార్థులు విద్య మీద శ్రద్ధ పెట్టి చదువుకొని ఉత్తమ విద్యార్థులుగా పేరు పొందుతారు. నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పరచుకుంటారు. ఈరోజు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం కలుగుతుంది. వ్యాపార లాభాలు కలుగుతాయి. మాట తీరు వల్ల అందరినీ ఆకట్టుకుంటారు. ఈరోజు గృహంలో శుభకార్యం తలపెడతారు.

పరిహారాలు: ఈరోజు శ్రీ హయగ్రీవ స్తోత్రం పారాయణం చేసుకోండి.

 

todays horoscope

వృషభ రాశి:ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది !

ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది. విద్యార్థులు అనవసరపు విషయాలు పట్టించుకోవడం వల్ల నష్టం జరుగుతుంది. విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోకపోవడం వల్ల  ఎక్కడైనా పడిపోయే అవకాశం ఉంది. ఆడవారు తోబుట్టువులను వెంట తీసుకొని బయటికి వెళ్లడం మంచిది. తొందరపడి ఎవరినైనా నమ్మడం వల్ల మోసపోయే అవకాశం ఉంది. విలువైన పత్రాల మీద సంతకాలు చేయడం వల్ల ఇబ్బందులు తలెత్తుతాయి. ప్రయాణాలకు అనుకూలంగా లేదు. వాహన ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా చేయడం మంచిది, ప్రమాదాలు తలెత్తుతాయి.

పరిహారాలు: ఈరోజు బృహత్ స్తోత్ర పారాయణం చేసుకోండి, దగ్గర్లో ఉన్న ఆలయానికి వెళ్లి నవగ్రహాలకు 11 ప్రదక్షిణాలు చేసుకోండి.

 

మిధున రాశి:అధికారుల వల్ల ఒత్తిడి !

ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది. విద్యార్థులు అనవసర విషయాలకు దూరంగా ఉండి చదువు మీద ఏకాగ్రత చూపడం మంచిది. ఉద్యోగస్తులకు అధికారుల వల్ల ఒత్తిడి ఏర్పడుతుంది. మానసిక ప్రశాంతత కోల్పోతారు. గృహంలో సమస్యలు తలెత్తుతాయి. మనోవేదనకు గురవుతారు. మాతృ ఆరోగ్యంలో జాగ్రత్త వహించడం మంచిది. అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది.

పరిహారాలు: ఈరోజు సంకష్టహర గణపతి రుద్ర పారాయణం చేసుకోండి.

 

కర్కాటక రాశి:పోగొట్టుకున్న డబ్బుని తిరిగి పొందుతారు !

ఈరోజు అనుకూలంగా ఉంటుంది. శత్రువులు కూడా మిత్రులు అవుతారు. వివాదాస్పద అంశం విషయాలు సమసిపోయి. అంతా బాగుంటుంది. గతంలో పోగొట్టుకున్న డబ్బుని తిరిగి పొందుతారు. కాంట్రాక్టు ఉద్యోగం పర్మినెంట్ అయ్యే సూచనలున్నాయి. వ్యాపారాలను విస్తరించుకొని అధిక లాభాలను పొందుతారు. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకొని పోటీపరీక్షల్లో విజయం పొందుతారు.

పరిహారాలు: ఈరోజు కనకధారా స్తోత్ర పారాయణం చేసుకోండి.

 

సింహరాశి:ఈరోజు అయిన వారు దూరమవుతారు !

ఈరోజు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. మీ అంతట మీరే అన్ని వ్యతిరేకంగా చేసుకుంటారు. తొందరపాటు వల్ల వివాదాలు పెరిగి అయినవారు దూరమవుతారు. వ్యసనాలకు దూరంగా ఉండండి. వాహన ప్రయాణాలవల్ల ఆపదలు సంభవిస్తాయి. ఎదుటి వారి తప్పులు ఎత్తి చూపడం వల్ల ఇబ్బందులు తలెత్తుతాయి. విద్యార్థులు తల్లిదండ్రులకు అబద్దాలు చెప్పడం వల్ల  నష్టపోతారు, విద్య మీదనే శ్రద్ధ వహించడం మంచిది. వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు ఏర్పడే అవకాశం ఉంది.

పరిహారాలు: ఈరోజు శివాష్టకం పారాయణం చేసుకోండి, పొంగలి భగవంతుడికి నివేదన సమర్పించండి.

 

కన్యారాశి:ఈరోజు అధిక లాభాలు పొందుతారు !

ఈరోజు ఆనందకరంగా ఉంటుంది. వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టి అధిక లాభాలు పొందుతారు. విద్యార్థులు కష్టపడి బాగా చదువుకొని పోటీపరీక్షల్లో విజయం పొందుతారు, ఉన్నతశ్రేణి మార్కులు పొందుతారు. వాహనాలను కొనుగోలు చేస్తారు. ప్రయాణాలకు అనుకూలమైన రోజు. తీర్థయాత్రలు చేస్తారు. గతంలో పోగొట్టుకున్న ఉద్యోగాన్ని తిరిగి అందుకుంటారు.

పరిహారాలు: ఈరోజు రామ నామ పారాయణం చేసుకోండి.

 

తులారాశి:ఈరోజు అన్నదమ్ముల మధ్య విభేదాలు !

ఈరోజు అనుకూలంగా లేదు. మొండి బాకీలు వసూలు కాక ధననష్టం జరుగుతుంది. వచ్చిన మంచి అవకాశాలను కోల్పోతారు. మానసిక ప్రశాంతత కోల్పోతారు. నీటి సంబంధ అనారోగ్యాలు తలెత్తుతాయి. అన్నదమ్ముల మధ్య విభేదాలు తలెత్తుతాయి.

పరిహారాలు: ఈరోజు రుద్ర కవచం పారాయణం చేసుకోండి.

 

వృశ్చిక రాశి:ఉత్తమ విద్యార్థులుగా పేరు పొందుతారు !

ఈరోజు రాజయోగంగా ఉంటుంది. అప్పుల బాధ నుంచి బయట పడతారు. వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం వల్ల అధిక లాభాలను పొందుతారు. మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. అన్నదమ్ముల్లా కలిసిమెలిసి సంతోషంగా ఉంటారు. విద్యార్థులు బాగా చదువుకొని ఉత్తమ విద్యార్థులుగా పేరు పొందుతారు. కుటుంబ సభ్యులతో కలిసి మెలిసి ఉంటారు.

పరిహారాలు:  శ్రీ వెంకటేశ్వర వజ్ర కవచం పారాయణం చేసుకోండి.

 

ధనస్సు రాశి:ఈరోజు తీర్థయాత్రలు చేస్తారు !

ఈరోజు ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి. అధిక ఖర్చులు చేయడం వలన ధననష్టం జరుగుతుంది. కాంట్రాక్టు ఉద్యోగాలు పర్మినెంట్ అవుతాయి. గృహాల్లో శుభకార్యం చేసే అవకాశం ఉంది. సోదరులతో కలిసి మెలిసి సంతోషంగా ఉంటారు. ప్రయాణాలకు అనుకూలం. తీర్థయాత్రలు చేస్తారు. విద్యార్థులు కష్టపడి బాగా చదువుకుంటారు.

పరిహారాలు:  లలితా చాలీసా పారాయణం చేసుకోండి.

 

మకర రాశి:సంతాన విషయంలో శుభవార్తలు !

ఈరోజు అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు బాగా చదువుకొని పోటీపరీక్షల్లో ఉత్తీర్ణులు అవుతారు. దంపతులిద్దరూ అన్యోన్యంగా ఉంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం కలుగుతుంది. గృహంలో వేడుక జరిగే అవకాశం ఉంది. సంతాన విషయంలో శుభవార్తలు వింటారు. వ్యాపారాలు అధిక లాభాలు కలుగుతాయి.

పరిహారాలు: అష్టలక్ష్మి స్తోత్రం పారాయణం చేసుకోండి.

 

కుంభరాశి:వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు !

ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది. ప్రయాణాలకు అనుకూలమైన రోజు కాదు. వాహన ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా చేయడం మంచిది, ప్రమాదాలు ఏర్పడే అవకాశం ఉంది. వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు ఏర్పడతాయి. విలువైన పత్రాల మీద సంతకాలు చేయకుండా ఉండటం మంచిది. అమ్మాయిలు ఒంటరిగా బయటికి వెళ్లడం వల్ల నష్టం జరుగుతుంది.

పరిహారాలు: ఈరోజు అలివేలు మంగ సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆరాధన చేసుకోండి.

 

మీన రాశి:ధన లాభం పొందుతారు !

ఈరోజు అనుకూలంగా ఉంటుంది. కుటుంబసభ్యులతో ఆనందంగా  ఉంటారు. విద్యార్థులు కష్టపడి చదువుకుని పై చదువులకు ఉత్తీర్ణులు అవుతారు. అప్పుల బాధలు తీర్చుకొని మొండి బాకీలు వసూలు చేసుకుని ధన లాభం పొందుతారు. వ్యాపారాల్లో ఆశించిన ధనలాభం కలుగుతుంది. గృహోపకరణ వస్తువులను కొనుగోలు చేస్తారు. గొప్ప వ్యక్తులతో పరిచయాలు అనుకూలిస్తాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకుంటారు, సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు.

పరిహారాలు: ఈరోజు విష్ణుసహస్రనామ పారాయణం చేసుకోండి.

 

Read more RELATED
Recommended to you

Latest news