ఫిబ్రవరి 04 గురువారం: రాశి ఫలాలు మరియు పరిహారాలు

-

ఫిబ్రవరి – 4- పుష్యమాసం- గురువారం.

మేష రాశి: పోటీ పరీక్షల్లో రాణిస్తారు !

ఈరోజు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఉద్యోగస్తులు ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంది. అనవసరపు ఖర్చులను తగ్గించుకోవడం మంచిది. ఈరోజు పెద్ద వారి మాటలను, సలహాలను పాటించడం మంచిది. ప్రయాణాలకు అనుకూలమైన రోజు కాదు. విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోవడం మంచిది, ఎక్కడైనా పోయే అవకాశం ఉంది. కొత్త వాహనాలు కొనడం వల్ల నష్టం. ఈరోజు పోటీ పరీక్షల్లో రాణిస్తారు నూతన వ్యాపార పెట్టుబడులు పెట్టకపోవటం మంచిది.
పరిహారాలు: శుభ ఫలితాల కోసం కాలభైరవ అష్టకం పారాయణం చేసుకోండి.

todays horoscope

వృషభ రాశి: ఆకస్మిక ధన లాభం పొందుతారు !

ఈరోజు బాగుంటుంది. దంపతులు అన్యోన్యంగా ఉంటారు. నిరుద్యోగులు ఉద్యోగ అవకాశం పొందుతారు. సమాజంలో కీర్తి గౌరవాలను పొందుతారు. గృహాన్ని లేదా గృహ స్థలాలను కొనుగోలు చేయడానికి అనుకూలమైన రోజు. అనవసరపు ఖర్చులు కు దూరంగా ఉండడం వల్ల ఆకస్మిక ధన లాభం పొందుతారు. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడం వల్ల లాభాలు పొందుతారు. ఆరోగ్య విషయాల్లో బాగుంటుంది, సమస్త ఆరోగ్యాన్ని పొందుతారు. ప్రయాణాలు కలిసి వస్తాయి.
పరిహారాలు: ఈరోజు భ్రమరాంబిక అష్టకం పారాయణం చేసుకోండి.

మిధున రాశి: వివాహ ప్రయత్నాలకు అనుకూలం !

ఈరోజు శుభయోగంగా ఉంటుంది.అప్పుల బాధలు తీర్చుకొని ఆర్థిక లాభాలు పొందుతారు. వ్యాపారాలను విస్తరించడం వల్ల లాభాలను పొందుతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది, చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. వివాహ ప్రయత్నాలకు అనుకూలం. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుని పోటీ పరీక్షలో ఉత్తీర్ణత పొందుతారు. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు.
పరిహారాలు: శ్రీ అష్టలక్ష్మీ అష్టోత్తర పారాయణం చేసుకోండి

కర్కాటక రాశి: స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు !

ఈరోజు ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి. పిల్లల విషయంలో జాగ్రత్తగా చూసుకోవడం మంచిది. ఈరోజు స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. వ్యాపారంలో ఆర్థిక అభివృద్ధి పెరుగుతుంది. నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగం కలుగుతుంది. ప్రయాణాలకు అనుకూలమైన రోజు కాదు. ఆర్థిక నష్టం ఏర్పడే అవకాశం ఉంది. పెట్టుబడులు పెట్టడం వల్ల స్వల్ప లాభాలు ఏర్పడతాయి. కొత్త వ్యాపారాలు ప్రారంభించక పోవడం మంచిది.
పరిహారాలు: పేద వారికి సహాయం చేయండి. ఇష్టదేవతరాధన చేయండి.

సింహరాశి: ప్రయాణాలకు అనుకూలం !

ఈరోజు ప్రయోజకరంగా ఉంటుంది. అనవసర ఖర్చులకు దూరంగా ఉండి ధనాభివృద్ధి పొందుతారు. సమాజంలో ఉన్నత వ్యక్తిగా కీర్తింప బడుతారు. ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుంది. తీర్థయాత్రలు చేస్తారు. గృహ స్థలాలన్ని కొనుగోలు చేస్తారు. వ్యాపారంలో స్నేహితుల సహకారంతో పెట్టుబడులు పెట్టి లాభాలు పొందుతారు. గృహంలో ఏదో ఒక శుభకార్యాన్ని తలపెడతారు. అనారోగ్య సమస్యలు తొలిగిపోతాయి.
పరిహారాలు: హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోండి.

కన్యారాశి: తీర్థయాత్రలు చేస్తారు !

ఈరోజు ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి. మానసిక వేదనకు గురి అయ్యే అవకాశం ఉంది. తెలియని ఆందోళన పడుతుంటారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది, అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. క్రొత్త వ్యక్తులతో పరిచయాలు పెంచుకోవడం మంచిది. తీర్థయాత్రలు చేస్తారు. కొత్త పెట్టుబడులు పెట్టకపోవటం మంచిది. ఈరోజు ఉద్యోగస్తులు అనుకున్న స్థానాలకు బదిలీ అయ్యే అవకాశం ఉంది. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.
పరిహారాలు: ఈరోజు లలితా సహస్రనామ పారాయణం చేసుకోండి.

తులారాశి:వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు !

ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది. పని ఒత్తిడి పెరగడం వల్ల మానసిక వేదనకు గురవుతారు. బంధువుల గురించి పట్టించుకోక పోవడం మంచిది. స్థిరాస్తులను కోల్పోయే అవకాశం ఉంది. పెద్ద వారి సలహాలను పాటించడం మంచిది. వ్యాపారాలల్లో స్వల్ప నష్టాలు. ప్రయాణాలకు అనుకూలమైన రోజు కాదు. వ్యసనాలకు దూరంగా ఉండండి. అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. సాంప్రదాయక ఆహారాలకు ప్రాధాన్యత ఇవ్వడం మంచిది.
పరిహారాలు: శ్రీదుర్గా దేవి స్తోత్రం పారాయణం చేసుకోండి.

వృశ్చిక రాశి: ఆర్థిక లాభాలు పొందుతారు !

ఈరోజు ప్రయోజకరంగా ఉంటుంది. అప్పుల బాధలు తీరిపోతాయి. మొండి బకాయిలు వసూలు చేసుకుని ఆర్థిక లాభాలు పొందుతారు. సమాజంలో గొప్ప వ్యక్తులుగా కీర్తింప బడతారు. నిరుద్యోగులకు ఉన్నత ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. వ్యాపారాలను విస్తరించుకొని వ్యాపార లాభాలు పొందుతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది,అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది.
పరిహారాలు: శ్రీవిష్ణు సహస్రనామ పారాయణ చేసుకోండి.

ధనస్సు రాశి: పై అధికారుల మెప్పు పొందుతారు !

ఈరోజు బాగుంటుంది. వ్యాపార లాభాలు కలుగుతాయి. క్రొత్త పెట్టుబడులు పెట్టడానికి అనుకూలం. సమాజంలో పేరు ప్రఖ్యాతులు పొందుతారు. ఈరోజు ప్రయాణాలు కలిసి వస్తాయి. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకొని ఉన్నత చదువులకు ఉత్తీర్ణులు అవుతారు. ఉద్యోగస్తులు పై అధికారుల మెప్పు పొందుతారు. వివాహ విషయాలుకు ఫలిస్తాయి.
పరిహారాలు: ఈరోజు శ్రీదేవి ఖడ్గమాలా స్తోత్ర పారాయణం చేసుకోండి.

మకర రాశి: ఆరోగ్యంగా ఉంటారు !

ఈరోజు బాగుంటుంది. చేసే పనిలో సఫలీకృతులవుతారు. విద్యార్థులు బాగా చదువుకొని పోటీపరీక్షల్లో ఉన్నత శ్రేణి మార్కులు పొందుతారు. వ్యాపారంలో అధిక లాభాలు పొందుతారు. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఇంతకుముందు ఉన్న అనారోగ్యం తగ్గిపోయి ఆరోగ్యంగా ఉంటారు. స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. ఆర్థికాభివృద్ధిని పెంచుకుంటారు.
పరిహారాలు: ఈరోజు హయగ్రీవ స్తోత్రం పారాయణం చేసుకోండి.

కుంభరాశి: వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు !

ఈరోజు అనుకూలమైన రోజు కాదు. విలువైన వస్తువులు పోయే అవకాశం ఉంటుంది. అనవసర ఖర్చులకు దూరంగా ఉండటం మంచిది. ఆర్థిక నష్టం ఏర్పడే అవకాశం ఉంది. ఆదాయం తక్కువ ఖర్చు ఎక్కువగా ఉంటుంది. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టకపోవడం మంచిది, స్వల్ప నష్టాలు ఏర్పడే అవకాశం ఉంది. ప్రయాణాలకు దూరంగా ఉండటం మంచిది. దేవాలయ దర్శనం చేసుకుంటారు. కుటుంబ సభ్యుల సహకారంతో పనులను పూర్తి చేస్తారు.
పరిహారాలు: శ్రీలలితా చాలీసా పారాయణం చేసుకోండి.

మీన రాశి: ఈరోజు ప్రమోషన్లు పొందుతారు !

ఈరోజు ఆనందకరంగా ఉంటుంది. వ్యాపారంలో లాభాలు పొందుతారు. నూతన గృహాన్ని కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం కలుగుతుంది.ఉద్యోగస్తులు ప్రమోషన్లు పొందుతారు. ఆరోగ్య విషయంలో బాగుంతుంది. ఆర్థికంగా బాగుంటుంది. కుటుంబ సభ్యుల నుంచి సహకారం లభిస్తుంద. ముఖ్యవిషయాలపై చర్చిస్తారు. ఆఫీస్లో పై అధికారుల ప్రశంసలు వస్తాయి. అనుకోని చోట నుంచి శుభవార్తలు వింటారు. వైవాహికంగా బాగుంటుంది.
పరిహారాలు: శ్రీ మీనాక్షి అమ్మవారి స్తోత్రం పారాయణం చేసుకోండి.

– శ్రీ

Read more RELATED
Recommended to you

Latest news