నిమ్మగడ్డకి ఓటు వచ్చినా వేయడం కుదరదు ! ఎందుకో తెలుసా ?

-

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఓటు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. నిజానికి ఆయన స్వగ్రామం గుంటూరు జిల్లా దుగ్గిరాల కావడంతో అక్కడ ఆయన ఓటు హక్కు కోసం నమోదు చేసుకున్నారు. అయితే ఆయన ఇక్కడ ఉండటం లేదన్న కారణంతో అక్కడి లోకల్ ప్రిసైడింగ్ ఆఫీసర్ అయిన తహసీల్దార్ ఆయన ఓటు హక్కుకు అర్హులు కాదని నిరాకరించారు. దీంతో ఆయన కలెక్టర్ కు మళ్లీ అర్జీ పెట్టుకున్నాడు.

ఇప్పుడు మరలా ఆయన ఓటు ఇచ్చేందుకు గాను ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ఒకవేళ ఆయనకు ఓటు హక్కు లభించినా ఈ సారి పంచాయతీ ఎన్నికలలో ఓటు వేసే అవకాశం లేదని అంటున్నారు. ఎందుకంటే ఈ సారి జరుగుతున్న పంచాయతీ ఎన్నికలు 2019 ఓటర్ల జాబితా ప్రకారం జరుగుతున్నాయి. సో ఈ సారి ఆయన ఓటు వేసే అవకాశం అయితే కనిపించడం లేదు. అయినా సరే ఆయన ఓటు కోసం పట్టుపట్టడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news