పాదాలు వాపులు, నొప్పులు ఎక్కువగా ఉంటున్నాయా..? ఇలా చెయ్యండి..!

ఒక్కొక్కసారి పాదాలు కాళ్లు వాచిపోతూ ఉంటాయి అలాంటప్పుడు ఇబ్బందిగా ఉంటుంది. పాదాల వాపులు నొప్పులు ఉన్నట్లయితే ఇలా చేయండి అప్పుడు వాపులు నొప్పులు దూరం అవుతాయి. పాదాలు వాపు అనేది ఎక్కువ సేపు నిలబడడం లేదా కూర్చోవడం లేదంటే నడవడం వలన వస్తాయి. గర్భిణీలకు కూడా పాదాలు వాచిపోతూ ఉంటాయి. పాదాల్లో నీరు నిలిచిపోయినప్పుడు ఇలా పాదాల్లో వాపు కలుగుతూ ఉంటుంది.

నీళ్లు రెగ్యులర్ గా తాగితే కాళ్ళ వాపు తగ్గిపోతుంది కాళ్ళ వాపు తగ్గాలంటే యోగా కూడా బాగా ఉపయోగ పడుతుంది గోరువెచ్చని నీరు తీసుకుని అందులో రాళ్ల ఉప్పు వేసి పసుపు వేసి కాళ్ళని నానబెడితే కూడా కళ్ళల్లో వాపు తగ్గుతుంది. గాయాలు ఉన్నప్పుడు మాత్రం ఇలా చేయకండి ఎందుకంటే కాలు మండుతుంది. ఏమైనా గాయం పాదాలకి కలిగితే వాపు వస్తుంది. ఐస్ ఫ్యాక్స్ కంప్రెషన్ బ్యాండేజ్ లతో కూడా ఈ సమస్యలను దూరం చేయొచ్చు లేదంటే చల్లని నీటిలో కూడా పాదాలని నానబెట్టొచ్చు.

కూర్చున్నప్పుడు లేదా పడుకున్నప్పుడు కాళ్ళని పైకి లేపి గోడకి ఆన్చండి రాత్రి పడుకున్నప్పుడు ఇలా పైకి లేపి ఉంచితే కూడా వాపు తగ్గుతుంది. శరీరం నుండి టాక్సిన్స్ తగ్గించడానికి నిమ్మరసం కూడా చాలా చక్కగా పనిచేస్తుంది. నిమ్మరసం తాగితే కూడా పాదాల్లో వాపు తగ్గుతుంది. ఉప్పు ఆల్కహాల్ మాత్రం తీసుకోవద్దు. ప్రాసెస్డ్ ఫుడ్ వంటివి కూడా తీసుకోవద్దు. వాపులనీ, నొప్పులనీ దూరం చేయాలంటే మసాజ్ చేయండి మసాజ్ కూడా చాలా చక్కగా పనిచేస్తుంది.