వరంగల్ ఈస్ట్ రేసుగుర్రాలు..ఆధిక్యం ఎవరిది?

-

వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో హోరాహోరీ పోరు జరిగే స్థానాలు చాలానే ఉన్నాయి. ఈ సారి త్రిముఖ పోరు ఊహించని విధంగా జరగనుంది. బి‌ఆర్‌ఎస్, బి‌జే‌పి, కాంగ్రెస్‌ల మధ్య పోరు రసవత్తరంగా సాగనుంది. అలా హోరాహోరీ పోరు జరిగే నియోజకవర్గాల్లో వరంగల్ ఈస్ట్ కూడా ఒకటి అని చెప్పవచ్చు. గతంలో కాంగ్రెస్‌కు, తెలంగాణ వచ్చాక బి‌ఆర్‌ఎస్ పార్టీకి అనుకూలంగా ఉన్న ఈ స్థానంలో వచ్చే ఎన్నికల్లో హోరాహోరీ పోరు జరిగేలా ఉంది.

2008 నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఏర్పడిన వరంగల్ ఈస్ట్ లో 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. అప్పుడు ప్రజారాజ్యంపై కాంగ్రెస్ గెలిచింది. టి‌డి‌పితో పొత్తులో పోటీ చేసి బి‌ఆర్‌ఎస్ మూడోస్థానానికి పరిమితమైంది. ఇక రాష్ట్ర విభజన తర్వాత అక్కడ సీన్ మారింది. అలాగే కాంగ్రెస్ నుంచి వైసీపీకి..వైసీపీ నుంచి బి‌ఆర్‌ఎస్ లో చేరిన కొండా సురేఖ..2014లో ఈస్ట్ నుంచి పోటీ చేసి దాదాపు 55 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. 2018 ఎన్నికలోచ్చేసరికి కొండా ఫ్యామిలీకి సీట్ల విషయంలో తేడా రావడంతో మళ్ళీ కాంగ్రెస్ లోకి వెళ్ళిపోయారు.

దీంతో వరంగల్ ఈస్ట్ నుంచి బి‌ఆర్‌ఎస్ తరుపున నన్నపునేని నరేందర్ పోటీ చేసి..కాంగ్రెస్ పై 28 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఇక వచ్చే ఎన్నికల్లో మళ్ళీ ఆయనే బి‌ఆర్‌ఎస్ నుంచి బరిలో దిగడానికి రెడీ అవుతున్నారు. కాకపోతే ఈ సారి ఆయనకు అనుకున్నంత పాజిటివ్ లేదు. అదే సమయంలో ఈ సారి ఇక్కడ కాంగ్రెస్ నుంచి కొండా సురేఖ పోటీ చేయడం ఖాయం..బి‌జే‌పి నుంచి ఎర్రబెల్లి ప్రదీప్ రావు బరిలో దిగే ఛాన్స్ ఉంది.

2009లో ప్రదీప్ ప్రజారాజ్యం నుంచి పోటీ చేసి మంచిగానే ఓట్లు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఆయన బి‌జే‌పి నుంచి పోటీ చేయనున్నారు. దీంతో వరంగల్ ఈస్ట్ లో త్రిముఖ పోరు జరగనుంది. ప్రస్తుతం ఆధిక్యం ఎవరి వైపు కనబడటం లేదు. టఫ్ ఫైట్ జరిగేలా ఉంది. చూడాలి మరి ఈ సారి వరంగల్ ఈస్ట్ ఎవరి సొంతమవుతుందో.

Read more RELATED
Recommended to you

Latest news